విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో టీడీపీ గన్నవరం ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం కార్యకర్తలతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ.. టీడీపీ ప్రకటించిన ఆరు హామీలపై ప్రచారం చేశారు. చంద్రబాబు హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించడంతో పాటు 2024లో అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. అంతేకాకుండా.. స్థానిక సమస్యలపై యార్లగడ్డ ఆరా తీశారు. యువతను ఉత్సాహ పరిచేందుకు గ్రామంలోని పలు వీధుల్లో మోటారు బైక్‌పై తిరుగుతూ అభివాదం చేశారు.
Assam Budget: రూ. 2.9 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అస్సాం సర్కారు..
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీకి పట్టం కడుదామని ఈవీఎంల్లో బటన్ నొక్కుదామని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసారని దుయ్యబట్టారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు చంద్రబాబును కోరుకుంటున్నారని తెలిపారు. మరోవైపు గన్నవరంలో టీడీపీ గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. తాను గెలుస్తే.. గన్నవరం అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని తెలిపారు.
Bihar: బలపరీక్షలో నితీష్ కుమార్ సర్కార్ విజయం
2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో డబ్బు, మద్యం ఎంతమాత్రం ప్రభావం చూపవని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. దీనికి ప్రధాన కారణం వైసీపీ అధికారంలో ఉంటే సామాన్య ప్రజలు జీవనం సాగించే పరిస్థితి లేకపోవడ మేనన్న సత్యాన్ని ప్రజలు గ్రహించడమేనని చెప్పారు. అధికారంలోకి రాకముందు జగన్మోహనరెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజలకు చాలా దగ్గరగా ఉండేవాడని అధికారం చేతికి వచ్చాక ఆయన ప్రజలకు చాలా దూరంగా ఉంటున్నారన్న విషయం అందరూ చూస్తునే ఉన్నారన్నారు. 2024లో అధికారంలోకి వచ్చేది చంద్రబాబే అని జోస్యం చెప్పారు.
