Site icon NTV Telugu

Yarlagadda Venkatarao: ఉంగుటూరు మండలంలో యార్లగడ్డ ప్రచార హోరు..

Yarlagadda

Yarlagadda

ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ నేతలు ప్రచారంలో జోరు పెంచారు. గడపగడపకు తిరుగుతూ తమకు ఓటేయాలని ప్రజలను కోరుతున్నారు. తాము అధికారంలోకి వస్తే.. సంక్షేమం, అభివృద్ధి పథకాలను తీసుకొస్తామంటూ చెబుతూ ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంగా.. గన్నవరం నియోజకవర్గ ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.

OTT Movies: ఈ వారం ఓటీటీలోకి విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు..

ఉంగుటూరు మండలంలోని నందమూరు, మధిరపాడు, చికినాల్, బోకినాల, చాగంటిపాడు, వేంపాడు, తరిగొప్పుల గ్రామాల్లో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరితో కలిసి యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. సూపర్‌ సిక్స్‌ పథకాల వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపారు. చంద్రబాబు సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు.

Nokia: మరోసారి కమ్బ్యాక్ ఇస్తున్న నోకియా.. అదే స్టైల్తో..

రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని గెలిపించాలని యార్లగడ్డ కోరారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రత్యేక ప్రణాళిక ద్వారా గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నెంబర్ వన్ స్థానంలో నిలుపుతానని హామీ ఇచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, అదే విధంగా గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి బాలశౌరి గారిని ఎంపీగా గెలిపించాలని అభ్యర్థించారు. ముందుగా ఆయా గ్రామాల్లో పర్యటించిన యార్లగడ్డ, బాలశౌరికి మహిళలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version