Site icon NTV Telugu

Yarlagadda Venkata Rao : నేను వైసీపీలోనే ఉన్నాను.. వైసీపీ నుంచే సీటు ఇస్తారని ఆశిస్తున్నాను

Yarlagadda

Yarlagadda

నేను వైసీపీలోనే ఉన్నానని, వైసీపీ నుంచే సీటు ఇస్తారని ఆశిస్తున్నానంటూ వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా నుంచి తీసుకు వచ్చి జగన్ నన్ను క్రాస్ రోడ్డులో నిల్చో పెడతారని నేను అనుకోవటం లేదని, జగన్, వైసీపీ అధిష్టానం నాకు అన్యాయం చేస్తారని అనుకోవటం లేదన్నారు. గత ఎన్నికల్లో నేనే ఇక్కడ నుంచి పోటీ చేశానని, గన్నవరం వేరే సీటు వారికి ఇచ్చామని ఇంకా ప్రకటన చేయలేదు కదా అని ఆయన అన్నారు.

Also Read : Double Bedroom: లక్ష డబుల్ బెడ్‌ రూం ఇళ్ల పంపిణీ.. ఈనెల 15 నుంచి ప్రారంభం

టీడీపీలో నేను జాయిన్ అవుతా అనేది సోషల్ మీడియా ప్రచారం మాత్రమేనని, పెనమలూరు సీటు ఇస్తా అని జగన్ అంటే నేను ఇండియా వచ్చానన్నారు. తర్వాత గన్నవరం సీటు నుంచి జగన్ పోటీ చేయమని చెబితే అక్కడ నుంచి పోటీ చేసి గన్నవరం లో వైసీపీని పటిష్టం చేశానన్నారు. రిగ్గింగ్, దొంగ ఇళ్ళ పట్టాల కారణంగా ఓటమి పాలయ్యాఅని, నేను గెలిచి ఉంటే నియోజక వర్గానికి ఈ ఖర్మ ఉండేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని కారణాలతో గన్నవరంలో రాజకీయాలకు దూరంగా ఉన్నా తప్ప నియోజక వర్గానికి కాదని, జగన్ నాకు గన్నవరం అనే పెద్ద కుటుంబాన్ని ఇచ్చారని ఆయన అన్నారు.

Also Read : Pension Scheme For Farmers: రైతులకు శుభవార్త.. ప్రతి నెల రూ.3000ఇవ్వనున్న కేంద్రప్రభుత్వం

Exit mobile version