ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ యమహా మోటార్ ఇండియా నవంబర్ 11న భారత మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. దీనితో పాటు, కంపెనీ కొత్త యమహా FZ RAVE, యమహా XSR155 మోటార్‌సైకిళ్లను కూడా విడుదల చేసింది. 2026 నాటికి భారతదేశంలో 10 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో 2 ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఉండనున్నట్లు తెలిపింది.
Also Read:Pakistan – Afghanistan Conflict: యుద్ధం అంచున రెండు ముస్లిం దేశాలు..!
యమహా ఇప్పుడు ప్రీమియం, డీలక్స్ మోటార్ సైకిళ్లపై దృష్టి పెట్టనుంది. ప్రస్తుతం, R15, MT15, XSR155 వంటి మోడళ్లు ఇప్పటికే భారత మార్కెట్లో కొత్త ట్రెండ్‌ను సృష్టించాయి. ఈ మోటార్ సైకిళ్లతో, యమహా భారతీయ వినియోగదారుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని తన ఉత్పత్తులను రూపొందించింది. అదనంగా, డీలక్స్ విభాగాన్ని రిఫ్రెష్ చేయడానికి FZ-RAVE వంటి కొత్త బైక్‌లను ప్రవేశపెట్టారు.
Also Read:World’s Billionaires List: ఈ 10 దేశాలలో భారత్ కంటే ఎక్కువ ధనవంతులు.. ఏయే దేశాలంటే?
2026 నాటికి భారతదేశానికి యమహా రోడ్‌మ్యాప్ సిద్ధంగా ఉంది. కంపెనీ 2026 నాటికి 10 కొత్త మోడళ్లను విడుదల చేస్తుంది. 20 కి పైగా ప్రొడక్స్ట్ ను అప్‌డేట్ చేస్తుంది. ఇందులో రెండు ICE మోటార్‌సైకిళ్లు, రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. కంపెనీ 2026 మొదటి త్రైమాసికంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను – ఏరోక్స్ E, EC-06 – విడుదల చేయనుంది.
