Site icon NTV Telugu

Yadadri Brahmotsavam 2024: ఈనెల 11 నుంచి 21 వరకు యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు.. రేపు యాదాద్రికి సీఎం రేవంత్

Yadadri Fianl

Yadadri Fianl

Yadadri Brahmotsavam 2024: ఈనెల 11 నుండి 21 వరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 11న(రేపు) స్వస్తి వచనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు బ్రహ్మోత్సవాలలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం పాల్గొననున్నారు. రేపు ఉదయం యాదాద్రికి సీఎం రేవంత్‌ రెడ్డి పాటు ఆరుగురు మంత్రులు యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దర్శించుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి భద్రాచలం వెళ్లనున్నారు.

Read Also: Minister Ponguleti: కేయూలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన

యాదగిరిగుట్టలో ఈ నెల 17న శ్రీ స్వామి వారి ఎదుర్కోలు.. 18న శ్రీ స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం.. 19న శ్రీ స్వామి వారి దివ్య విమాన రథోత్సవాలను నిర్వహించనున్నారు. రూ. కోటి 60 లక్షల బడ్జెట్‌తో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనుబంధ పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19న ప్రారంభమై 25 వరకు కొనసాగనున్నాయి.

Exit mobile version