XRISM research satellite successfully launched By Japan: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్ 3 ను విజయవంతంగా చంద్రుని మీద ప్రయోగించినప్పటి నుంచి ప్రపంచ దేశాలు కూడా చంద్రుని మీద ప్రయోగాలకు సిద్ధమయ్యాయి. ఇక ఈ క్రమంలోనే రష్యా లూనా 25 ను ప్రయోగించి విఫలమయ్యింది. కాగా జపాన్ మొదటిసారి చంద్రనిపైకి ప్రయోగం చేపట్టింది. జపాన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం (జాక్సా) సెప్టెంబర్ 7న H-IIA రాకెట్‌ను మూన్ ల్యాండర్‌తో ప్రయోగించింది. గత నెలలో వాతావరణ అనుకూలంగా లేని కారణంగా ఈ ప్రయోగాన్ని వరుసగా వాయిదా వేశారు. అనంతరం గురువారం జపాన్ దీనిని ప్రయోగించింది. ఇది వచ్చే ఏడాది ప్రారంభంలో చంద్రునిపై ల్యాండ్ కానుంది.
Also Read: Viral Video: ఈ కొంగ ఏంటి పిల్లను అలా పడేసింది? కారణం అదే అయ్యింటుందా?
H-IIA రాకెట్ ను దక్షిణ జపాన్‌లోని కగోషిమాలోని తనేగాషిమా స్పేస్ సెంటర్‌లోని లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించారు. ఇది విశ్వం మూలాలను అధ్యయనం చేసే ఎక్స్-రే ఇమేజింగ్ మరియు స్పెక్ట్రోస్కోపీ మిషన్ (XRISM) అని పిలువబడే ఎక్స్-రే టెలిస్కోప్‌ను కలిగి ఉంది. ఈ XRISM నక్షత్రమండలాల మధ్య వున్న ప్రదేశం కూర్పు, వేగాన్ని కొలుస్తుంది. ఇదే ప్రయోగంలో చంద్రుడి రహస్యాలను తెలుసుకునేందుకు స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ స్లిమ్ (SLIM)) పేరుతో ఓ తేలికపాటి లూనార్ ల్యాండర్‌ను కూడా పంపించారు. అయితే ఈ స్లిమ్ ల్యాండర్ చంద్రుని కక్ష్యలోని మూడు నాలుగు నెలల తరువాత అంటే వచ్చే ఏడాది ప్రారంభంలో దిగనుంది. ఖగోళ వస్తువు నిర్మాణం, విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ మిషన్ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా వివిధ తరంగదైర్ఘ్యాల వద్ద కాంతిని అధ్యయనం చేయడం, ఉష్ణోగ్రత అంచనాలు కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ మిషన్ నాసా(NASA) సహకారంతో నిర్వహించబడుతుంది. ఇక స్మార్ట్ ల్యాండర్ ను విజయవంతంగా ప్రయోగించినందుకు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా)ని అభినందించింది ఇస్రో . బెంగుళూరు కేంద్రంగా ఉన్న జాతీయ అంతరిక్ష సంస్థ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ( ట్విట్టర్)లో జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేసింది. ఈ మిషన్ చంద్రని పై విజవంతంగా దిగాలని ఇస్రో ఆకాంక్షించింది.
Congratulations @JAXA_en on the successful launch of the SLIM lander to the moon.
Best wishes for another successful lunar endeavour by the global space community. https://t.co/7HSjtoFHx7— ISRO (@isro) September 7, 2023