NTV Telugu Site icon

Xiaomi X Pro QLED: ‘షావోమీ’ నుంచి సూపర్ స్మార్ట్‌టీవీ.. ధర చాలా తక్కువ!

Xiaomi X Pro Qled

Xiaomi X Pro Qled

Xiaomi X Pro QLED Smart TV Launch Date in India: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ‘షావోమీ’.. స్మార్ట్‌ఫోన్‌లతో పాటు స్మార్ట్‌టీవీలను కూడా వరుసగా రీలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో తక్కువ ధరలో మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌టీవీని తీసుకొచ్చేందుకు సిద్దమైంది. ఎక్స్ సిరీస్‌లో భాగంగా ‘షావోమీ ప్రో క్యూఎల్‌ఈడీ’ టీవీని ఆగస్టు 27న లాంచ్‌ చేయనుంది. వచ్చే వారం ఫ్లిప్‌కార్ట్ మరియు షావోమీ వెబ్‌సైట్లలో అమ్మకాలు ఆరంభం కానున్నాయి.

షావోమీ ప్రో క్యూఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీని 43 ఇంచెస్‌, 55 ఇంచెస్‌, 65 ఇంచెస్‌తో తీసుకొస్తున్నారు. ఈ టీవీలో 32 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీ ఉండనుంది. ఈ టీవీలో మ్యాజిక ఫీచర్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దాంతో యూజర్లు వైబ్రంట్ కలర్ ఎక్స్‌పీరియన్స్ పొందనున్నారట. ఈ టీవీ స్క్రీన్‌ ఫినిషింగ్‌లు మెటల్‌లో డిజైన్‌ చేశారు. అల్ట్రా-స్లిమ్ బెజెల్‌లను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఈ టీవీల్లో సినిమాటిక్ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ అందించేలా స్పీకర్‌లను అమర్చారట.

Also Read: iQOO Z9x Price: అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. ‘ఐకూ జెడ్‌ 9ఎక్స్‌’పై 6 వేల తగ్గింపు!

షావోమీ ప్రో క్యూఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీలో ప్యాచ్ వాల్ ఇంటర్ ఫేస్, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టంలను అందించనున్నారని తెలుస్తోంది. ఈ టీవీల ధరను ఇంకా అధికారికంగా ప్రకటించకున్నా.. రూ. 35,999 ప్రారంభం అవుతుందని అంచనా. ఆగస్టు 27న దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. మీరు కొత్త స్మార్ట్‌టీవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

Show comments