NTV Telugu Site icon

Big Battery Smartphones: ఛార్జింగ్‌ కష్టాలకు చెక్‌.. ‘బిగ్‌ బ్యాటరీ’తో రానున్న షావోమీ స్మార్ట్‌ఫోన్స్!

Xiaomi Logo

Xiaomi Logo

Xiaomi Plans To Release Latest Smartphones With Big Battery’s: ఇన్నాళ్లూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీపై దృష్టి పెట్టిన మొబైల్‌ తయారీ కంపెనీలు.. ఇకపై ఛార్జింగ్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు ఆలోచన చేస్తున్నాయి. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ‘షావోమీ’ భవిష్యత్‌లో తీసుకురాబోయే స్మార్ట్‌ఫోన్లలో గరిష్ఠంగా 7,500 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించాలని చూస్తోందట. అంతేకాదు అత్యంత వేగంగా ఛార్జ్‌ అయ్యేలా ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీపైనా షావోమీ పనిచేస్తోందని తెలుస్తోంది.

5500 ఎంఏహెచ్‌, 6000 ఎంఏహెచ్‌, 6500 ఎంఏహెచ్‌, 7000 ఎంఏహెచ్‌, 7500 ఎంఏహెచ్‌.. వివిధ బ్యాటరీ సామర్థ్యాలతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను తీసుకురావడంపై షావోమీ ఫోకస్ చేసిందట. కేవలం 18 నిమిషాల్లో ఛార్జింగ్‌ అయ్యేలా 5500 ఎంఏహెచ్‌ బ్యాటరీని 100 వాట్స్ ఛార్జింగ్ చేసే సాంకేతికతతో తీసుకురానుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీని 34 నిమిషాల్లోనే పూర్తి చేసే టెక్నాలజీపైన పని చేస్తోందట. 7000 ఎంఏహెచ్, 7500 ఎంఏహెచ్‌ ఫోన్లు కూడా కేవలం 50 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జ్‌ చేసేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయాలని భావిస్తోందట.

Also Read: Gold Rate Today: బంగారం ధరలకు బ్రేక్‌.. నేడు తులం బంగారం ఎంతుందంటే?

షావోమీ సబ్‌బ్రాండ్‌ ‘రెడ్‌మీ’ కే70 అల్ట్రా చైనాలో ఇటీవల లాంచ్‌ అయింది. 5500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో ఈ ఫోన్ వచ్చింది. కేవలం 24 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్‌ ఛార్జ్ అవుతుందని షావోమీ తెలిపింది. షావోమీలోని చాలా హ్యాండ్‌సెట్‌లు ఇప్పటికే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వచ్చాయి. మరోవైపు వన్‌ప్లస్‌, ఒప్పో కూడా బిగ్‌ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Show comments