NTV Telugu Site icon

Xiaomi: దిగొచ్చిన చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ.. సరసమైన ధరలో 5G మొబైల్ ప్రైస్..!

Mi

Mi

చైనా స్మార్టఫోన్‌ తయారీదారులపై కొనసాగుతున్న ఒత్తిడి నేపథ్యంలో చైనా కంపెనీ షావోమి సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో, చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమి సప్లయిర్‌ డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ శివార్లలో భారీ ఫ్యాక్టరీని నిర్మించేందుకు రెడీ అవుతుంది. దీంతో ఐఫోన్‌ తయారీ దారు తైవాన్‌ కంపెనీ ఫాక్స్‌కాన్‌కు పోటీగా డిక్సన్‌కు షావోమి భాగస్వామ్యం మరింత బలపడతాయని అంచనా. అయితే, వైరల్ గా మారిన ఈ వార్తలపై అటు షావోమి గానీ, డిక్సన్‌గానీ అధికారికంగా ప్రకటించలేదు.

Read Also: State Elections: ఈ ఇద్దరు సీఎంలపై మండిపోతున్న ప్రజలు.. తెలంగాణ, ఎంపీ, ఏపీ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరాంపై సర్వే

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఫ్యాక్టరీలో డిక్సన్ మూడు సంవత్సరాలలో 400 కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టనుంది. ప్రధానంగా ఇక్కడ షావోమి స్మార్ట్‌ఫోన్‌లను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్లాంట్‌ను ఈ నెలాఖరులో ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే షావోమీ గతంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న బ్లూటూత్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ ఫోన్‌లను తయారు చేయడానికి దేశీయ ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ కంపెనీతో కాంట్రాక్ట్‌ చేసుకుంది. ఇవి గతంలో చైనా నుంచి దిగుమతి అయ్యేవి.. డిక్సన్ వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రానిక్స్ కంపెనీ.. మోటరోలా, శాంసంగ్ లాంటి బ్రాండ్‌ల స్మార్ట్‌ ఫోన్‌లు, వాషింగ్ మెషీన్‌లు, టెలివిజన్ సెట్‌లతో సహా ఇతర ఉత్పత్తులను త్వరగా తయారు చేస్తుంది. మూడు దశాబ్దాల క్రితం ఢిల్లీ శివార్లలో సునీల్ వచాని డిక్సన్‌ కంపెనీను స్టార్ట్ చేశారు.

Read Also: Shrikanth Iyyangar: ఏంటీ పెళ్లి పిచ్చి.. మొన్న ఆమె, ఇప్పుడీమె?

కాగా, ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒకపుడు టాప్‌లో దూసుకుపోయిన.. షావోమి భారత కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, నియంత్రణలతో మార్కెట్‌లో భారీ నష్టాలను చూసింది. దీని నుంచి కోలుకునేందుకు.. తీసుకున్న చర్యల్లో భాగంగా మేడిన్‌ ఇండియా 5జీ స్మార్ట్‌ఫోన్‌లను సరసమైన ధరలో అందించేందుకు షావోమీ ప్లాన్‌ చేస్తోంది.