Xiaomi QLED TV X Pro: షియోమీ భారత్‌లో తన QLED TV X Pro 2025 ఎడిషన్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో మూడు స్క్రీన్ సైజులు అందుబాటులో ఉన్నాయి. 43, 55, 65 అంగుళాల స్క్రీన్ సైజులు ఉన్న టీవీలను విడుదల చేసింది. టెక్నాలజీ అభిమానుల కోసం షియోమీ అత్యాధునిక ఫీచర్లతో ఈ టీవీలను తీసుకొచ్చింది. ఈ టీవీలలో 4K రిజల్యూషన్ తో పాటు క్వాంటం డాట్ టెక్నాలజీ ఉపయోగించబడింది. దీని ద్వారా మెరుగైన బ్రైట్నెస్, కాన్ట్రాస్ట్, ఇంకా రంగుల విభేదాన్ని అందిస్తుంది. 1.07 బిలియన్ కలర్ డెప్త్, DCI-P3 వైడ్ కలర్ గామట్ తో ఈ టీవీలు అత్యుత్తమ రంగుల ప్రదర్శనను ఇస్తాయి. డాల్బీ విజన్, HDR10+ మద్దతుతో ప్రతి ఫ్రేమ్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
Read Also: Vivo V50e: 6.77-అంగుళాల AMOLED డిస్‌ప్లే, IP69 రేటింగ్స్, 50MP కెమెరాతో లాంచైన వివో V50e
ఫిల్మ్‌మేకర్ మోడ్‌ను ఈ టీవీల్లో అందుబాటులోకి తెచ్చారు. ఇది నాయిస్ రెడక్షన్, మోషన్ స్మూతింగ్ వంటి ఎన్‌హాన్స్‌మెంట్‌లను డిసేబుల్ చేసి, కంటెంట్‌ను దానంతట అదే ఫార్మాట్‌లో చూపిస్తుంది. అలాగే ఐ కేర్ మోడ్ ద్వారా నీలిరంగు వెలుతురు తగ్గించి, DC డిమ్మింగ్ ద్వారా ఎక్కువ సేపు చూసినప్పటికీ కళ్లకు భారం లేకుండా చూసేలా రూపొందించారు. ఈ టీవీ సిరీస్ క్వాడ్ కోర్ A55 ప్రాసెసర్, Mali-G52 MC1 GPU తో పని చేస్తుంది. ఈ టీవీలలో 2GB RAM, 32GB స్టోరేజ్ ఉంటుంది. గేమర్ల కోసం 120Hz గేమ్ బూస్టర్ ఉండడంతో ఆటలలో ల్యాటెన్సీ తగ్గించి మెరుగైన ప్రతిస్పందనను అందిస్తుంది.
34W ఆడియో అవుట్‌పుట్ తో కూడిన ఈ టీవీలు డాల్బీ ఆడియో, DTS:X, DTS Virtual:X కు మద్దతునిస్తాయి. షియోమీ ప్రత్యేకంగా రూపొందించిన Xiaomi సౌండ్ ప్రీసెట్‌లు కంటెంట్ ప్రకారం ఆడియోను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తాయి. ఈ టీవీలు Google TV పై రన్ అవుతాయి. గూగుల్ అసిస్టెంట్ తో వాయిస్ కంట్రోల్స్, యాప్ యాక్సెస్, స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఇక కనెక్టివిటీలో భాగంగా ఇందులో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, 3x HDMI (1x eARC), 2x USB 2.0, Ethernet, AV, 3.5mm, ఆప్టికల్ పోర్ట్ లు ఉన్నాయి. కొత్తగా డిజైన్ చేసిన రిమోట్ కంట్రోల్ కూడా బాక్స్‌లో వస్తుంది.
Read Also: Tahawwur Rana: కసబ్‌కి కాంగ్రెస్ బిర్యానీ పెట్టింది.. తహవూర్ రాణా అప్పగింతపై కేంద్రమంత్రి..
యూజర్లకు 30 కంటే ఎక్కువ కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌లను ఒకే చోట తీసుకువస్తుంది. 300+ లైవ్ ఛానల్స్, ప్రత్యేక స్పోర్ట్స్ జోన్, యూట్యూబ్ మ్యూజిక్ ఇంటిగ్రేషన్, వ్యక్తిగతీకరించిన కంటెంట్ కలెక్షన్లను అందిస్తుంది. Xiaomi TV+ ద్వారా 200+ లైవ్ ఛానల్స్ ను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. QLED TV X Pro 2025 సిరీస్ ఏప్రిల్ 16, 2025 నుండి mi.com లో అమ్మకానికి లభించనుంది. ఇక ధరల విషయానికి వస్తే.. 43 అంగుళాల మోడల్ రూ.31,999, 55 అంగుళాల మోడల్ రూ.44,999, 65 అంగుళాల మోడల్ రూ.64,999కు లభించనుంది. Xiaomi QLED TV X Pro సిరీస్ ద్వారా షియోమీ అత్యున్నత విజువల్, ఆడియో అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. సినిమాలు, గేమింగ్, కంటెంట్ స్ట్రీమింగ్ కోసం వినియోగదారుల అవసరాలను తీర్చగల స్మార్ట్ టీవీ ఇది.