ఐఫోన్, శాంసంగ్‌కు పోటీగా Xiaomi 18 Pro సిరీస్.. గ్లోబల్ మార్కెట్లోకి Xiaomi 18 Pro, 18 Pro Max.. 200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్..!
- ఈ నెలలో Xiaomi 18 Pro, Xiaomi 18 Pro Max స్మార్ట్ఫోన్లను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల
- ఈ రెండు ఫోన్లలో 200MP ప్రైమరీ, 200MP పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా
- 6.4 అంగుళాల AMOLED డిస్ప్లేతో పాటు వెనుకవైపు 2.7 అంగుళాల సెకండరీ స్క్రీన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi 18 Pro and 18 Pro Max Global Launch: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ మరోసారి ప్రీమియం ఫోన్ మార్కెట్‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు Xiaomi 18 Pro, Xiaomi 18 Pro Maxలను ఈ నెలలోపల అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్లలో Snapdragon 8 Elite Gen 6 సిరీస్ ప్రాసెసర్లు, 200MP కెమెరాలు ప్రత్యేకంగా నిలవనున్నాయి.
Xiaomi 18 Pro
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.4 అంగుళాల Full HD+ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. వెనుకవైపు 2.7 అంగుళాల AMOLED సెకండరీ డిస్ప్లే కూడా అందించారు. Snapdragon 8 Elite Gen 6 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్లో 16GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజ్ ఉన్నాయి. Android 17 ఆధారిత HyperOS 4 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. OIS సపోర్ట్‌తో కూడిన 200MP ప్రైమరీ కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50MP కెమెరా ఇచ్చారు. ఇందులో 7,000mAh బ్యాటరీ, 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. అలాగే 27W రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.
Also Read
- Mijia Electric Toothbrush 2 Pro: షియోమీ ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ లాంచ్.. కలర్ స్క్రీన్, ప్రెజర్ అలర్ట్ ప్రత్యేకతలు ఇవే!
- Google Maps: అసలు.. గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ జామ్ ఎలా తెలుస్తుంది? దీని వెనుక అసలు టెక్నాలజీ ఇదే!
- REDMAGIC 12 Pro: 8400mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ ఫోన్.. REDMAGIC 12 Pro లాంచ్.. 185Hz OLED డిస్ప్లే, 50MP కెమెరా
- HP New Laptops Launched: HP OmniBook 5, ProBook 4 G2iS భారత్ లో లాంచ్.. రూ.1.10 లక్షల ల్యాప్‌టాప్ రూ.79,999కే!
Xiaomi 18 Pro Max
ఈ సిరీస్‌లో పెద్ద మోడల్ అయిన Xiaomi 18 Pro Maxలో 6.9 అంగుళాల Full HD+ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. వెనుకవైపు 2.9 అంగుళాల AMOLED సెకండరీ స్క్రీన్ అందించారు. Snapdragon 8 Elite Extreme Gen 6 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్లో 16GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజ్ ఉన్నాయి. కెమెరాల పరంగా 200MP ప్రైమరీ సెన్సార్, 200MP పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్ కూడా Android 17 ఆధారిత HyperOS 4పై పనిచేస్తుంది.
షావోమీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ నెలలోనే గ్లోబల్ మార్కెట్లో ఈ రెండు ఫోన్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇటలీకి చెందిన రిటైలర్ Epto వెబ్సైట్లోనూ ఈ ఫోన్ల వివరాలు కనిపించాయి. చైనా వేరియంట్లలో ఉన్న స్పెసిఫికేషన్లే అంతర్జాతీయ మోడళ్లలోనూ ఉండే అవకాశం ఉంది. అయితే గ్లోబల్ ధరలు, భారత్‌లో లాంచ్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
తాజావార్తలు
-
CM Chandrababu Aerial Survey: మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ వ్యూ..
-
CM Chandrababu: కరువు నుంచి రైతన్న గట్టెక్కేలా ఆదుకోండి.. కేంద్ర బృందానికి సీఎం విజ్ఞప్తి..!
-
Renu Desai: ‘బాలు’ ప్యాంట్‌పై రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్.. రేటు అప్పట్లోనే 75K అంట!
-
CM Chandrababu : కరువు నుంచి రైతన్న గట్టెక్కేలా ఆదుకోండి
-
CM Chandrababu : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే హవా కొనసాగాలి
ట్రెండింగ్
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!