NTV Telugu Site icon

USA vs China: తైవాన్ ను స్వాధీనం చేసుకునేందుకు చైనా ప్లాన్.. మండిపడుతున్న అమెరికా..

Usa Vs China

Usa Vs China

గత కొన్నేళ్లుగా డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం చైనా గూఢచారి బెలూన్ కుంభకోణంతో పాటు తైవాన్‌కు సంబంధించి ఇరు దేశాలు ముఖాముఖిగా విమర్శలు గుప్పించుకున్నాయి. నవంబర్ నెలలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో సమావేశం అయ్యారు. ఈ భేటీ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని భావించినప్పటికీ.. తైవాన్‌ను చైనాలో కలుపుతామని డ్రాగన్ కంట్రీ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చెప్పారు.

Read Also: Salaar: దాదాపు ఆరేళ్ల తర్వాత ఆ రికార్డుని బ్రేక్ చేసిన ప్రభాస్…

ఇక, తైవాన్ చైనాతో మళ్లీ కలుస్తుందని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ హెచ్చరించారు. అయితే, చైనా ఈ చర్యను ఎప్పుడు తీసుకుంటుందో ఇప్పటి వరకు చెప్పలేదు. 2025 లేదా 2027లో తైవాన్‌ను స్వాధీనం చేసుకోవాలని జిన్ పింగ్ యోచిస్తున్నట్లు అమెరికా సైనిక అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కామెంట్స్ పై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ ను చైనా బలవంతంగా విలీనం చేసుకోవడం మంచిది కాదు.. ఇరు దేశాల అధినేతలు శాంతియుతంగా చర్చించుకోని సంబంధిత అంశాలపై తగిన నిర్ణయాలు తీసుకోడం మంచిదని యూఎస్ చెప్పింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు సైతం డ్రాగన్ కంట్రీ అధ్యక్షుడు జిన్‌పింగ్ హెచ్చరిక జారీ చేయడంతో అమెరికాలో కలకలం రేపుతున్నాయి.

Show comments