బలమైన సైనిక వ్యవస్థతో పాటు ఇప్పటికే పొరుగు దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నా డ్రాగన్ కంట్రీ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మిలిటరీ బలోపేతంలో భాగంగా మరో కొత్త సైన్యాన్ని తయారు చేసేందుకు శ్రీకారం చూట్టింది. సైబర్ సైన్యం ఏర్పాటు చేసేందుకు చైనా కసరత్తు చేస్తుంది. ఇన్‌ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్‌ఎఫ్) పిలిచే ఈ కొత్త విభాగానికి యుద్ధాలను గెలిపించే సామర్థ్యం ఉందని డ్రాగన్ కంట్రీ చైనా భావిస్తుంది. దీనికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అనుమతి ఇచ్చారు.
Read Also: Bengaluru: బెంగళూరులో పోలీసులపై దాడి.. ఎనిమిది మంది నైజీరియన్లు అరెస్ట్..
ఇక, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి పెద్ద సైన్యమైన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ఇది వ్యూహాత్మకంగానే కాకుండా కీలకంగా మారనుందని తెలిపారు. చైనా సైన్యంలో అత్యున్నత కమాండ్ అయిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ (CMC) అధిపతిగా, అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (CPC) అధినేతగా తాను వ్యవహరిస్తున్నాట్లు పేర్కొన్నారు. ఐఎస్‌ఎఫ్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రధాన నిర్ణయాన్ని.. బలమైన సైన్యాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సీపీసీ, సీఎంసీలు ఈ మేరకు నిశ్చయించుకున్నట్లు తెలిపారు. రాజకీయ, సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు 2015లో ఏర్పాటు చేసిన స్ట్రేటజిక్ సపోర్ట్ ఫోర్స్(SSF)కు నవీన రూపమే ఐఎస్‌ఎఫ్ అని పరిశీలకులు తెలియజేస్తున్నారు.