NTV Telugu Site icon

X Blue Tick: ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఇకపై వారికి ‘బ్లూ టిక్’ కు నో పేమంట్స్..!

2

2

ప్రపంచంలో కుబేరుడుగా పేరుగాంచిన ఎలాన్ మస్క్ ​కు సంబంధించిన ‘ఎక్స్​’ ప్లాట్ ​ఫామ్​ కొంత మంది యూజర్లకు పూర్తి ఉచితంగా కాంప్లిమెంటరీ ‘బ్లూ టిక్​’ లను అందించనుంది. కాకపోతే ఈ విషయంపై చాలా మంది కన్ఫ్యూజన్​ స్టేజి లో ఉన్నారు. దీనికి కారణం, ఎలాన్ మస్క్ 2022లో ట్విట్టర్ ​ను కొనుగోలు చేసిన తర్వాత, ట్విట్టర్ యూజర్ల నుంచి నెలకు 8 డాలర్లు చొప్పున వసూలు చేసి, ‘బ్లూ టిక్​’​ లను ఇవ్వడం మొదలు పెట్టాడు.

Also read: Harish Rao: కేసీఆర్‌పై మంత్రులు చేసిన వ్యాఖ్యలకు హరీష్ కౌంటర్

కాకపోతే రోజురోజుకి పరిస్థితి చేయి దాటిపోతుండడం వల్ల ఎలాన్ మస్క్ యూ – టర్న్ తీసుకున్నట్లు అర్థమవుతుంది. ఇక పై ఎవరికైనా వారి ఖాతాకు 2500 మందికంటే ఎక్కువ వెరిఫైడ్ ఫాలోవర్లు ఉన్న యూజర్లకు పూర్తి ఉచితంగా బ్లూ టిక్ అందిస్తామని స్పష్టం చేశారు ట్విట్టర్ టీం.. వీటితోపాటు వాళ్లకు ప్రీమియం ఫీచర్లను కూడా ఫ్రీగా అందిస్తామని ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఎవరికైనా వారి ఖాతాలో 5000 కంటే ఎక్కువ మంది వెరిఫైడ్ ఫాలోవర్లు ఉన్న అకౌంట్లకు పూర్తి ఉచితంగా ప్రీమియం ప్లస్ ఫెసిలిటీస్ కల్పిస్తామని పేర్కొన్నారు.

Also read: Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కోసం కొత్త ఇల్లు.. వీడియోలు వైరల్!

దీనితో బుధవారం అర్ధరాత్రి నుంచి పలువురు ఎక్స్ యూజర్ల అకౌంట్లకు ‘బ్లూ టిక్’​ లను పునరుద్ధరించడం చేసింది ‘ఎక్స్​’ . దీనితో పలువురు యూజర్లు ఈ విషయంపై చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ విషయంలో బ్లూ టిక్​ మార్క్​ కోసం డబ్బులు కట్టినవాళ్లు మాత్రం కాస్త ఫ్రస్టేషన్ ​కు గురవుతున్నారు. ఆపై ఈ తాజా పరిణామం గురించి ఎలాన్​ మస్క్ గానీ, వారి అధికారిక ప్రతినిధుల నుండి కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం కాస్త గమనించాల్సిన విషయమే.