Site icon NTV Telugu

WWE Hyderabad : హైదరాబాద్ వేదికగా తొలిసారి WWE… హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు

Wwe Hyderabad

Wwe Hyderabad

హైదరాబాద్ వేదికగా తొలిసారి WWE సూపర్ స్టార్ స్పెక్టాకిల్ పేరుతో ఈవెంట్ నిర్వహించనున్నారు. అయితే.. సెప్టెంబర్ 8న గచ్చిబౌలి స్టేడియం వేదికగా సూపర్ ఫైట్ జరుగనుంది. ఈ సూపర్‌ ఫైట్‌లో 28 మంది అంతర్జాతీయ ఛాంపియన్స్ తలపడనున్నారు. ప్రత్యేక ఆకర్షణ గా డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ జాన్ సినా నిలువనున్నారు. 17 ఏళ్ల తర్వాత జాన్ సిన ఇండియా కి రానుండటం విశేషం. అయితే.. ఈ సూపర్‌ ఫైట్‌ ఈవెంట్‌కు హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోయాయి. నెల రోజుల ముందే టికెట్లు సోల్డ్‌ ఔట్ బోర్డు పెట్టేసింది బుక్‌మైషో. 500 రూపాయల నుంచి 17 వేల రూపాయల వరకు టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించారు.

Also Read : UP Teacher: టీచర్ దెబ్బకి మూతబడిన స్కూల్.. దర్యాప్తు చేస్తున్న అధికారులు

ఒక్క టికెట్ కూడా అందుబాటులో లేదని.. అన్నీ అమ్ముడుపోయాయి అని బుక్ మై షో వెల్లడించింది. ఈ సూపర్‌ ఫైట్‌లో పాల్గొనేందుకు ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేథ్ ఫ్రీకిన్ రోలిన్స్ హైదరాబాద్ కి రానున్నారు. విమెన్ ఛాంపియన్ రియా రిప్లే కూడా ఈ ఫైట్‌కు రానున్నారు. అంతేకాకుండా.. WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్ సమీ జైన్, కెవిన్ ఓవెన్స్‌ తోపాటు ఇంటర్‌కాంటినెంటల్ ఛాంపియన్ గుంథర్, జిందర్ మహల్, వీర్, సంగ, డ్రూ మెక్‌ఇంటైర్, బెక్కీ లించ్, నటల్య, మాట్ రిడిల్, లుడ్విగ్ కైజర్ వంటి WWE స్టార్‌లు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఈ ఈవెంట్‌లో సందడి చేయనున్నారు.

Also Read : Karishma Tanna Bangera: కరిష్మా తన్న బంజర గ్లామరస్ ఫొటోలు

Exit mobile version