WTC Team India: బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ మిర్పూర్‌లోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో ఆతిథ్య బంగ్లాదేశ్‌ను ఓడించింది. దింతో ఆఫ్రికన్ జట్టు 10 ఏళ్ల తర్వాత ఆసియా ఖండంలో దక్షిణాఫ్రికా టెస్టు విజయాన్ని అందుకుంది. అంతకుముందు 2014లో గాలెలో శ్రీలంకపై ఆసియా ఖండంలో దక్షిణాఫ్రికా చివరి టెస్టు విజయం సాధించింది. ఇక మీర్పూర్ టెస్టులో చిరస్మరణీయ విజయంతో, దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో దూసుకెళ్లింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా ఇప్పుడు నాలుగో స్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా పాయింట్ల శాతం 47.62కి పెరిగింది. పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా జట్టు న్యూజిలాండ్ (44.44), ఇంగ్లండ్ (43.06)లను అధిగమించింది. మరోవైపు, ఈ ఓటమితో బంగ్లాదేశ్ జట్టు డబ్ల్యూటీసీ పట్టికలో ఏడవ స్థానానికి చేరుకుంది. దింతో ఇప్పుడు బంగ్లాదేశ్ జట్టు ఫైనల్స్ రేసుకు దూరమైంది.
ఇక మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుత డబ్ల్యూటీసీలో మరో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ ఐదు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా జట్టు గెలిస్తే.. గరిష్టంగా 69.44 శాతంకు చేయగలిగితే వచ్చే ఏడాది లార్డ్స్ వేదికగా జరిగే ఫైనల్‌లో చోటు దక్కించుకోవచ్చు. నాలుగు మ్యాచ్‌లు గెలిచిన తర్వాత కూడా దక్షిణాఫ్రికా 61.11 శాతం మార్కులతో ఫైనల్‌కు దూసుకుపోతుంది. ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత జట్టు మొదటి స్థానంలో ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు, 3 ఓటములు, ఒక డ్రాతో 98 పాయింట్లతో 68.06 శాతంతో ఉంది. ప్రస్తుత డబ్ల్యూటీసీలో భారత్ మరో 7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. నవంబర్‌లో ఐదు టెస్టు మ్యాచ్‌ల కోసం భారతీయులు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. అంతకు ముందు న్యూజిలాండ్‌తో ఇప్పడు జరుగుతున్న పూణె మ్యాచ్, ఆపై ముంబైలలో టెస్టు మ్యాచ్‌లు ఆడుతోంది. ఫైనల్స్‌కు చేరుకోవాలంటే భారత్ ఈ ఏడు మ్యాచ్‌ల్లో కనీసం 3 మ్యాచ్‌లు గెలవాలి. ఒకవేళ 4 మ్యాచ్‌లు గెలిస్తే ప్లేస్ పూర్తిగా ఖాయం అవుతుంది. 3 టెస్టులు గెలిస్తే, భారత్ వేరే జట్టు గెలుపు లేదా ఓటమిపై ఆధారపడాల్సి రావచ్చు.
Also Read: Caste Conflict Case: సంచలనం.. ఒకేసారి 98 మంది దోషులకు జీవిత ఖైదు
ఇక డబ్ల్యూటీసీలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. కంగారూ జట్టు 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, మూడు ఓటములు, ఒక డ్రాతో 90 పాయింట్లతో 62.5 శాతంతో ఉంది. మరోవైపు శ్రీలంక జట్టు మూడో స్థానంలో ఉంది. తొమ్మిది మ్యాచ్‌ల్లో శ్రీలంక 55.56 శాతంతో 60 పాయింట్లు సాధించింది. దక్షిణాఫ్రికా నాలుగో స్థానంలో, న్యూజిలాండ్ ఐదో స్థానంలో, ఇంగ్లండ్ ఆరో స్థానంలో నిలిచాయి. బంగ్లాదేశ్ ఏడో స్థానంలో ఉండగా, పాకిస్థాన్ 8వ స్థానంలో, వెస్టిండీస్ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.