Temba Bavuma: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో ఆసీస్ జట్టుపై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించిన తర్వాత, మ్యాచ్‌కి సంబంధించిన మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవూమా సంచలన వ్యాఖ్య చేసారు. ఆట జరుగుతున్న సమయంలో ఆసీస్ ఆటగాళ్లు ‘చోక్’ అనే పదాన్ని పదేపదే ఉపయోగిస్తూ స్లెడ్జింగ్ చేశారని పేర్కొన్నారు. ఆఖరి రోజు విజయం వైపుగా పయనిస్తున్న దక్షిణాఫ్రికా జట్టును అసహజంగా ఆట తప్పించేందుకు, ఆసీస్ ఆటగాళ్లు ‘చోక్’ అనే పదాన్ని ఉపయోగించారని బవూమా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Read Also: Drugs : జైలులోనే డ్రగ్స్ స్కెచ్.. బయటకు వచ్చి మళ్లీ అదే దందా
మేము బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ‘చోక్’ అనే పదాన్ని ఆసీస్ ఆటగాళ్లు వాడారని బవూమా తెలిపారు. మాకు ఆత్మవిశ్వాసం ఉంది. మేము ఫైనల్‌కి వచ్చాం అన్నదానికే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఇప్పుడు ఈ విజయం అందుకు సమాధానం అంటూ బవూమా పేర్కొన్నారు. అలాగే స్పిన్నర్ కేశవ్ మహారాజ్ మాట్లాడుతూ దక్షిణాఫ్రికా జట్టును అనేక ఏళ్లుగా వెంటాడుతున్న ‘చోకర్స్’ అనే ట్యాగ్‌కు ఇది ముగింపు అని అభిప్రాయపడ్డారు. ఇంకా ఆ పదం వినకపోవడం చాలా గొప్ప విషయం. ఇది జట్టుకి ఎంతో పెద్ద విజయం. గతంలో అడిగిన అన్ని ప్రశ్నలకు ఈ మ్యాచ్ సమాధానం ఇచ్చిందని మహారాజ్ వ్యాఖ్యానించారు.
Read Also: Telangana Police : నేరగాళ్లకు నో ఎస్కేప్.. అంబిస్ టెక్నాలజీతో క్రిమినల్స్‌ను ట్రాక్
