Site icon NTV Telugu

WTC Final 2025: లార్డ్స్‌లో స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు.. బ్రాడ్‌మన్, చందర్‌పాల్ రికార్డ్స్ బ్రేక్!

Steve Smith

Steve Smith

ఆస్ట్రేలియాను స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2025లో స్మిత్ (66; 112 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయడంతో ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో ఇదివరకు ఆస్ట్రేలియాకే చెందిన వారెన్ బార్డ్స్లీ (575 పరుగులు) అగ్ర స్థానంలో ఉండగా.. తాజా ఇన్నింగ్స్‌తో స్మిత్ టాప్ ప్లేస్‌లోకి దూసుకొచ్చాడు. స్మిత్ లార్డ్స్‌లో 10 ఇన్నింగ్స్‌లలో 59.10 సగటుతో 591 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి.

క్రికెట్‌ పుట్టినిల్లు లార్డ్స్‌ మైదానంలో స్టీవ్ స్మిత్‌ ఒక డబుల్ సెంచరీ చేశాడు. 2015లో ఇంగ్లండ్‌పై 215 పరుగులు బాదాడు. లార్డ్స్‌ మైదానంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్‌ జాబితాలో వారెన్ బార్డ్స్లీ (575 – ఆస్ట్రేలియా) రెండో స్థానంలో ఉన్నాడు. గ్యారీఫీల్డ్ సోబర్స్ (571 – వెస్టిండీస్), డాన్ బ్రాడ్‌మన్ (551 – ఆస్ట్రేలియా), శివ్‌నారాయణ్‌ చందర్‌పాల్ (512 – వెస్టిండీస్), దిలీప్ వెంగ్‌సర్కార్ (508 – భారత్), అలెన్ బోర్డర్ (503 – ఆస్ట్రేలియా) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

 

Exit mobile version