Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2012లో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన 56 ఏళ్ల మహిళకు కుడి కిడ్నీలో సమస్య (హైడ్రోనెఫ్రోసిస్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. మే 6, 2012న ఆశీర్వాద్ నర్సింగ్ హోమ్‌లో డాక్టర్ రాజీవ్ లోచన్ ఆమెకు శస్త్రచికిత్స చేశారు. అయితే, వ్యాధి ఉన్న కుడి కిడ్నీని తొలగించడానికి బదులుగా, ఆరోగ్యంగా ఉన్న ఎడమ కిడ్నీని డాక్టర్ పొరపాటున తొలగించారు. ఆపరేషన్ తర్వాత కూడా సమస్యలు తగ్గకపోవడంతో వేరే ఆసుపత్రిలో సీటీ స్కాన్ చేయించగా, తప్పుడు కిడ్నీని తొలగించినట్లు తేలింది. అప్పటినుంచి ఆమెను డయాలసిస్‌పై ఉంచారు. ఆరోగ్యం క్షీణించి, తీవ్రమైన హైపర్కలేమియా (రక్తంలో పొటాషియం పెరగడం), హైపోగ్లైసీమియా (షుగర్ లెవెల్స్ పడిపోవడం) కారణంగా ఆమె 2014లో మరణించారు.
బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చార్జ్‌షీట్ దాఖలైంది. దీనిపై డాక్టర్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. ఉత్తరప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఆ డాక్టర్ రిజిస్ట్రేషన్‌ను రెండేళ్లపాటు సస్పెండ్ చేసింది. మహిళ మరణానంతరం ఆమె కుటుంబం జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను ఆశ్రయించింది.
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
జస్టిస్ (రిటైర్డ్) ఎపి సాహి నేతృత్వంలోని ఎన్‌సిడిఆర్‌సి బెంచ్ దీనిని “అత్యంత తీవ్రమైన వైద్య నిర్లక్ష్యం”గా అభివర్ణించింది. ఎడమ కిడ్నీ సురక్షితంగా ఉండి ఉంటే ఆమె మరికొంత కాలం బతికేదని పేర్కొంది. ఒక కుటుంబానికి తల్లిగా, భార్యగా ఆమె కోల్పోయిన స్థానాన్ని భర్తీ చేయలేమని స్పష్టం చేస్తూ, బాధిత కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం చెల్లించాలని మే 18న సంచలన తీర్పునిచ్చింది.
తాజావార్తలు
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
-
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
-
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!