NTV Telugu Site icon

Couple Suicide: ‘పిల్లలను బాగా చూసుకోలేకపోయాం..’ సూసైడ్ నోట్ రాసి దంపతులు ఆత్మహత్య

Sucide

Sucide

‘ప్రాణాలతో ఉండి మా పిల్లలను బాగా చూసుకోలేకపోయాం… దగ్గరివారు ఎవరైనా మా పిల్లలను బాగా చూసుకుంటారని ఆశిస్తున్నాను.. ఇద్దరం మా ఇష్ట ప్రకారం ఆత్మహత్య చేసుకుంటున్నాం…’ అని ఓ హోటల్లో దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ప్రయాగ్‌రాజ్‌లో చోటు చేసుకుంది. ఈ ఆత్మహత్య ఘటనపై పోలీసులు వారి కుటుంబాలకు సమాచారం అందించారు. కరేలిలో నివాసముంటున్న మహమూద్ ఆలం (44) తన పిల్లలతో కలిసి రాజాజీపురంలోని ఓ ఇంట్లో ఏడేళ్లుగా నివసిస్తున్నాడు. శుక్రవారం రాత్రి హోటల్ రాజ్‌వీర్‌లోని రూం నంబర్ 302లో భార్య జెబా అన్సారీ (39)తో కలిసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హోటల్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా గది తలుపులు తెరవకపోవడంతో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందించారు.

Read Also: Hyderabad: ఘోర ప్రమాదం.. కేబుల్ బ్రిడ్జిపై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి

దీంతో వెంటనే అక్కడకి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. అలాగే వారు రాసిన సూసైడ్ నోట్‌ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో కుటుంబ సభ్యుల మొబైల్ నంబర్లు రాశారు. దీంతో.. ఆ నెంబర్లకు ఫోన్ చేసి సంఘటన గురించి మృతుల కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కాగా.. మృతదేహాలకు ఈరోజు పోస్టుమార్టం నిర్వహించారు.

Read Also: Dharavi: మురికివాడకు మంచిరోజులు..!ఊపందుకున్న ధారవి పునరాభివృద్ధి ప్రాజెక్టు

మహమూద్ ఆలం కంప్యూటర్ హార్డ్‌వేర్‌ నిర్వహిస్తుండేవాడు. అయితే.. తాను చేసే పనిలో నష్టం రావడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. సూసైడ్ నోట్‌లో కూడా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు రాశాడు. మృతుడు మహమూద్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆ పిల్లలను ప్రస్తుతం తన బావ సాజిద్ పెంచి పోషిస్తున్నాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి.. శుక్రవారం సాయంత్రం 4:22 గంటలకు మహమూద్ ఆలం హోటల్ గదిని బుక్ చేశాడు. అదే రోజు తమ పిల్లల వద్దకు వెళ్లి తాము ఒక పార్టీకి వెళ్తున్నట్లు చెప్పారు. మళ్లీ శనివారం వస్తామని చెప్పి వెళ్లినట్లు పిల్లలు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show comments