NTV Telugu Site icon

Sakshi Malik: నాకు కూడా ఆఫర్ వచ్చింది కానీ.. రాజకీయరంగ ప్రవేశంపై సాక్షి మాలిక్ కీలక వ్యాఖ్యలు

Sakshi Malik

Sakshi Malik

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరింగ్‌ పునియా చేరారు. హర్యానాలో వచ్చే నెల తొలివారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. వీరి చేరిక కాంగ్రెస్‌కి మరింత జోష్ ఇస్తోంది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్‌లో చేరికపై వినేష్ ఫోగట్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాలం మనకు అనుకూలంగా లేని సమయంలోనే ప్రజలకు ఎవరు అండగా ఉంటారో తెలుస్తుందని అన్నారు. ‘‘ నా కుస్తీ కెరీర్‌లో నన్ను ఆదరించినందుకు దేశ ప్రజలకు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను మరియు వారి అంచనాలను అందుకుంటానని ఆశిస్తున్నాను. నేను కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే వారు చెప్పినట్లు, సమయం చెడుగా ఉన్నప్పుడు మాత్రమే మనతో ఎవరు ఉంటారో తెలుసుకోవచ్చు. మనల్ని రోడ్లపైకి ఈడ్చుకెళ్లినప్పుడు బీజేపీ తప్ప మిగతా పార్టీలు మాతో పాటు నిలబడి మా బాధను, కన్నీళ్లను అర్థం చేసుకున్నాయి’’ అని ఆమె అన్నారు. తాజాగా ఈ రాజకీయరంగ ప్రవేశంపై సాక్షిమాలిక్ కూడా స్పందించింది.

READ MORE: TPCC Chief: టీపీసీసీ చీఫ్‌గా మహేష్‌ కుమార్ గౌడ్‌.. కారణమేంటి?

‘నాకు కూడా ఆఫర్ వచ్చింది’
వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా రాజకీయాల్లోకి వెళ్లడంపై సాక్షి మాలిక్ స్పందించింది. తనకు రాజకీయ పార్టీల నుంచి కూడా ఆఫర్లు వచ్చాయని సాక్షి మాలిక్ తెలిపింది. సాక్షిమాలిక్ మాట్లాడుతూ.. “నాకు కూడా (రాజకీయ పార్టీల నుంచి) ప్రతిపాదనలు వచ్చాయి. కానీ నేను ఏది నా పోరాటం చివరి వరకు సాగించాలని నిర్ణయించుకున్నాను. డబ్ల్యూఎఫ్‌ఐని పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు, మహిళలపై జరుగుతున్న దోపిడీలు అంతం కానంత వరకు నా పోరాటం కొనసాగుతుంది. ఈ పోరాటంలో నిజం, స్వచ్ఛత ఉంది. అందుకే ఇది కొనసాగుతుంది.” అని వ్యాఖ్యానించారు.

Show comments