WPL 2026: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో మూడు సార్లు ఫైనల్స్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 2026 సీజన్‌కు కొత్త కెప్టెన్‌ను డిసెంబర్ 23న ప్రకటించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు మెగ్ లానింగ్ నాయకత్వంలో అస్బుతంగా ఆడిన ఢిల్లీ.. ఈ ఏడాది ప్లేయర్ రిటెన్షన్లలో ఆమెను కొనసాగించకపోవడంతో ఆ అధ్యాయం ముగిసింది. వేలంలో మళ్లీ లానింగ్‌ను దక్కించుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. యూపీ వారియర్జ్ రూ.1.9 కోట్లకు ఆమెను కొనుగోలు చేయడంతో ఢిల్లీకి నిరాశ ఎదురైంది.
దీనితో ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా జెమిమా రోడ్రిగ్స్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈసారి తప్పకుండా భారతీయ ఆటగాడినే కెప్టెన్‌గా నియమించాలని ఫ్రాంచైజీ నిర్ణయించింది. ఈ విషయాన్ని డబ్ల్యూపీఎల్ వేలం సమయంలో సహ యజమాని పార్థ్ జిందాల్ కూడా స్పష్టం చేశారు. మాకు భారతీయ కెప్టెన్ కావాలన్నదానిపై స్పష్టత ఉంది. ఈ విషయంలో మా నిర్ణయం ఖరారైందని ఆయన తెలిపారు.
డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన తొలి ఆటగాళ్లలో జెమిమా రోడ్రిగ్స్ ఒకరు. మొదట్లో అనుభవం కొరత కారణంగా లానింగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినప్పటికీ, మూడేళ్ల తర్వాత ఇప్పుడు జెమిమాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడానికి ఇదే సరైన సమయమని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. లానింగ్ ఢిల్లీ తరఫున అత్యధిక పరుగులు చేసినప్పటికీ, మార్పు అవసరమనే ఆలోచనతోనే ఆమెను రిటైన్ చేయలేదని తెలుస్తోంది.
IPL 2026కు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మాస్టర్ ప్లాన్.. బీసీసీఐని ఒప్పించి మరీ..?
జెమిమా ఇప్పటివరకు డబ్ల్యూపీఎల్‌లో 27 మ్యాచ్‌లు ఆడి, 139.66 స్ట్రైక్‌రేట్‌తో 507 పరుగులు సాధించింది. ప్రస్తుతం ఆమె ఫామ్ మరింత ఆకట్టుకుంటోంది. 2025 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌లో సెంచరీ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. అలాగే విశాఖపట్నంలో శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అర్ధసెంచరీ సాధించి, భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలవడంలో సహకరించింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ 2026 సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త అధ్యాయాన్ని జెమిమా రోడ్రిగ్స్ నాయకత్వంలో ప్రారంభించనుందని క్రికెట్ వర్గాల్లో బలమైన చర్చ సాగుతోంది.
