Site icon NTV Telugu

WPL 2026: ఇట్స్ ఆఫీసియల్.. న్యూ సీజన్.. న్యూ కెప్టెన్.. ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ గా జెమిమా రోడ్రిగ్స్‌..!

Wpl 2026

Wpl 2026

WPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌కు జెమిమా రోడ్రిగ్స్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. గత మూడు సీజన్లలో జట్టును వరుసగా ఫైనల్స్‌కు చేర్చిన మెగ్ లానింగ్ స్థానంలో జెమిమా ఈ బాధ్యతలు చేపట్టనుంది. అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, భారతీయ క్రికెటర్లకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనతో ఈ మార్పు చేసినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది.

నిజానికి WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు తొలి సంతకం చేసిన ఆటగాళ్లలో జెమిమా ఒకరు. అప్పటి నుంచి జట్టుకు కీలక సభ్యురాలిగా మారిన ఆమె, ఇప్పటివరకు 27 మ్యాచ్‌ల్లో 139.66 స్ట్రైక్‌రేట్‌తో 507 పరుగులు చేసింది. వన్డే వరల్డ్‌కప్ 2025 సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయ శతకం, అలాగే విశాఖపట్నంలో శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో అజేయంగా 69 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉంది.

Shivaji : శివాజీ మైండ్‌సెట్‌పై జాలి పడుతున్నా..!” అనసూయ స్ట్రాంగ్ కౌంటర్!

ఈ కెప్టెన్సీ నిర్ణయాన్ని వెల్లడించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. అక్టోబర్‌లో ఫ్యాన్ మీట్‌కు పిలిచినట్లు చెప్పి, అక్కడే జెమిమాకు కెప్టెన్సీ విషయం తెలియజేశారు. ఆ క్షణాలను వీడియోగా చిత్రీకరించి.. అభిమానులతో పంచుకున్నారు. ఆ సందర్భంగా జెమిమా తల్లిదండ్రులు, సోదరుడు, సన్నిహితులు ఆమె కృషి, క్రీడాపై ఉన్న ప్రేమ గురించి మాట్లాడిన వీడియోలను ఆమెకు చూపించారు. అలాగే ఆమె కోచ్ జెమిమా కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి మహిళా క్రికెటర్ల సంఖ్య పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. చివరగా ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ ప్రత్యేకంగా రూపొందించిన కెప్టెన్ జెర్సీని జెమిమాకు అందజేస్తూ అధికారికంగా కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు.

Deputy CM Bhatti Vikramarka: కేసీఆర్ తోలు వలుస్తానంటే చూస్తూ ఊరుకోబోం..

ఈ సందర్భంగా జెమిమా మాట్లాడుతూ.. ఈ ఏడాది మనం కచ్చితంగా గెలుస్తాం. అదే నేను తీసుకురావాలనుకునే మార్పు. గత మూడు సంవత్సరాలుగా జట్టును నడిపిన మెగ్ లానింగ్‌కు పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. ఆమె ఏర్పరిచిన టీమ్ కల్చర్, నాయకత్వం నన్ను ఎంతో ప్రేరేపించాయి. ఆ క్రెడిట్ అంతా ఆమెకే చెందుతుందని పేర్కొంది.

https://twitter.com/DelhiCapitals/status/2003448872753070460

Exit mobile version