WPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌కు జెమిమా రోడ్రిగ్స్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. గత మూడు సీజన్లలో జట్టును వరుసగా ఫైనల్స్‌కు చేర్చిన మెగ్ లానింగ్ స్థానంలో జెమిమా ఈ బాధ్యతలు చేపట్టనుంది. అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, భారతీయ క్రికెటర్లకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనతో ఈ మార్పు చేసినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. నిజానికి WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు తొలి సంతకం చేసిన ఆటగాళ్లలో…