NTV Telugu Site icon

RCB vs MI: స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం అద్భుతం: ఎలీస్‌ పెర్రీ

Ellyse Perry

Ellyse Perry

Ellyse Perry Said I Can’t wait for the WPL 2024 Final: మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2024 ఫైనల్‌కు వెళ్లినందుకు ఆనందంగా ఉందని రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ఆల్‌రౌండర్‌ ఎలీస్‌ పెర్రీ అన్నారు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం అద్భుతం అని, స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేశారని ప్రశంసించారు. డబ్ల్యూపీఎల్‌ 2024 ఫైనల్ ఆడేందుకు ఎదురుచూస్తున్నా అని పెర్రీ పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు 5 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఫైనల్‌కు వెళ్ళింది.

మ్యాచ్ అనంతరం ఎలీస్‌ పెర్రీ మాట్లాడుతూ… ‘డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌లో అవకాశం లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం అద్భుతం. అమ్మాయిలు అందరూ ప్రశాంతంగా ఆడారు. ముఖ్యంగా స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేశారు. మ్యాచ్‌లో అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. అదే మేం చేశాము. గత రెండు మ్యాచ్‌లలో నేను బాగా ఆడినందుకు సంతోషంగా ఉంది. మేము ప్రశాంతంగా ఉన్న విధానం అసాధారణమైనది. గత సీజన్ ఓటమి తర్వాత పుంజుకున్న విధానం బాగుంది. మైదానం, వెలుపల ఒకరినొకరం సహకరించుకున్నాం. పెద్ద గేమ్‌లో పరుగులు చాలా ముఖ్యం. మొత్తానికి ఫైనల్ చేరినందుకు సంతోషం. ఫైనల్ కోసం ఎదురుచూస్తున్నా’ అని అన్నారు.

Also Read: RCB vs MI: ఎలిమినేటర్‌లో ముంబై ఓటమి.. డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌లోకి బెంగళూరు!

ఎలిమినేటర్ మ్యాచ్‌లో మొదట బెంగళూరు 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. ఎలీస్‌ పెర్రీ (66; 50 బంతుల్లో 8×4, 1×6) టాప్‌ స్కోరర్‌. హేలీ (2/18), నాట్‌ సీవర్‌ (2/18), ఇషాక్‌ (2/27) బెంగళూరును కట్టడి చేశారు. ఛేదనలో ముంబై 130/6కే పరిమితమైంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (33; 30 బంతుల్లో 4×4) పోరాడింది. శ్రేయాంక పాటిల్‌ (2/16), ఆశ (1/13), పెర్రీ (1/29), మోలనూ (1/16) బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో బెంగళూరు తలపడుతుంది.