RCB vs MI: 4 పరుగులు ఇచ్చి ఓ వికెట్.. ఆర్‌సీబీ గేమ్ ఛేంజర్ శ్రేయాంక పాటిల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WPL 2024 RCB v MI Turning Point: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫైనల్‌కు వెళ్ళింది. శుక్రవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో గెలిచిన ఆర్‌సీబీ.. మొదటిసారి డబ్ల్యూపీఎల్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 5 పరుగుల తేడాతో గట్టెక్కింది. ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ 18వ ఓవర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్‌సీబీ బౌలర్ శ్రేయాంక పాటిల్ అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను ఆర్‌సీబీ వైపు తిప్పింది.
స్వల్ప ఛేదనలో హేలీ (15), యాస్తిక (19), సీవర్ (23)ల వికెట్లను కోల్పయిన ముంబై.. 10.4 ఓవర్లలో 68/3తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో హర్మన్‌ప్రీత్ (33; 30 బంతుల్లో 4×4), అమేలియా (27 నాటౌట్)తో కలిసి స్కోరు పెంచింది. వీలుచిక్కినప్పుడల్లా షాట్లు ఆడిన హర్మన్.. రన్ రేట్ పడిపోకుండా చూసింది. పెర్రీ వేసిన 16వ ఓవర్లో హర్మన్ రెండు బౌండరీలు బాదడంతో.. ముంబై విజయ సమీకరణం 24 బంతుల్లో 32గా మారింది. తర్వాతి ఓవర్లో అమేలియా రెండు ఫోర్లు బాదడంతో ముంబైకి 18 బంతుల్లో 20 రన్స్ అవసరం అయ్యాయి.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
క్రీజులో హర్మన్‌ప్రీత్, అమేలియా ఉండడంతో ముంబై విజయం లాంఛనమే అనుకున్నారు అందరూ. ఇక్కడే శ్రేయాంక పాటిల్ మ్యాజిక్ చేసింది. మొదటి ఐదు బంతులకు 4 పరుగులు ఇచ్చిన శ్రేయాంక.. చివరి బంతికి హర్మన్‌ప్రీత్‌ను అవుట్ చేసింది. హర్మన్‌ప్రీత్ భారీ షాట్ ఆడగా.. లాంగ్ ఆన్‌లో డివైన్ అద్భుత క్యాచ్ పట్టింది. దాంతో హర్మన్‌ప్రీత్ పెవిలియన్ చేరింది. దాంతో ముంబై విజయ సమీకరణం 12 బంతుల్లో 16 పరుగులుగా మారింది. ఇక్కడే మ్యాచ్ టర్న్ అయింది.
Also Read: IPL 2024: కోహ్లీతో కలిసి బాబర్ ఆడితే.. పాక్ అభిమానికి హర్భజన్ కౌంటర్!
19వ ఓవర్ వేసిన సోఫీ మోలినెక్స్ నాలుగే పరుగులిచ్చి సజన (1) వికెట్‌ను తీసింది. చివరి ఓవర్లో 12 పరుగులు అవసరం కాగా.. లెగ్ స్పిన్నర్ ఆశ శోభన మాయాజాలం చేయడంతో బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రేయాంక పాటిల్ 4 ఓవర్లలో 16 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ పడగొట్టింది. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రేయాంకపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
SHREYANKA PATIL, THE GAME CHANGER…!!!
– MI needed 20 from 18 balls then she went for just 4 runs & took the wicket of Harmanpreet Kaur. pic.twitter.com/eIEHP4XZhc
— Johns. (@CricCrazyJohns) March 15, 2024
Shreyanka Patil is really impressive with the bowl.Harmanpreet Kaur is WPL bully and deceiving her twice in an over needs skill.
Richa Ghosh has given her a life but She didn’t only throw her wickets but have a chance to RCB to make Comeback.pic.twitter.com/sdKtBDU5Lg
— Sujeet Suman (@sujeetsuman1991) March 15, 2024
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!