NTV Telugu Site icon

WPL 2023 : ముంబయి ఇండియన్స్ జట్టు గెలుచుకున్న ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

Mumbai

Mumbai

మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ అట్టహాసంగా ముగిసింది. తొలిసారి విజేతగా ముంబయి ఇండియన్స్ జట్టు రికార్డు సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో ముంబై టీమ్ గెలిచింది. మొట్టమొదటిసారి WPL ట్రోఫీని హర్మన్ ప్రీత్ సేన ముద్దాడింది.. సంబరాల్లో మునిగిపోయింది. మహిళా క్రికెట్ లో సరికొత్త అధ్యాయానికి బీసీసీఐ శ్రీకారం చుట్టింది. WPL తొలి సీజన్ ను ముంబై జట్టు మధుర జ్ఞాపకంగా ఉంచుకుంది. ఇక ఈ విజయంతో ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ జట్టు పలు విభాగాల్లో సత్తా చాటింది. పలువురు క్రికెటర్లు ఈ లీగ్ లో గెలుచుకున్న ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

Also Read : Manchu Manoj: విష్ణు గొడవపై స్పందించిన మనోజ్…

WPL విజేత-ముంబయి ఇండియన్స్-గోల్డెన్ ట్రోఫీ.. రూ. 6 కోట్లు, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్- రూ.3 కోట్లు, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్-హేలీ మాథ్యూస్ (ముంబయి ఇండియన్స్)-రూ. 5లక్షలు, ఆరెంజ్ క్యాప్( అత్యధిక పరుగులు)- మెగ్ లానింగ్( ఢిల్లీ క్యాపిటల్స్ )-9 ఇన్సింగ్స్ లో 345 పరుగులు-రూ.5 లక్షలు, పర్పూల్ క్యాప్( అత్యధిక వికెట్లు )- హేలీ మాథ్యూస్( ముంబయి ఇండియన్స్ ) 16 వికెట్లు, ఫెయిర్ ప్లే అవార్డు-ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, క్యాచ్ ఆఫ్ ది సీజన్-హర్మన్ ప్రీత్ కౌర్( ముంబయి)-యూపీ వారియర్జ్ దేవికా వైద్య క్యాచ్-రూ.5 లక్షలు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ యస్తికా భాటియా( ముంబయి )-8 ఇన్సింగ్స్ లో 13 సిక్సర్లు- రూ.5 లక్షలు అందుకున్నారు.

Also Read : Today Business Headlines 27-03-23: మనమే ‘ఎక్స్‌-రే’ చేసుకుందాం. మరిన్ని వార్తలు

మహిళల ప్రీమియర్ లీగ్ విజేతకు అందిన మొత్తం పీఎస్ఎల్ ఛాంపియన్ లాహోర్ కలందర్స్ గెలుచుకున్న మొత్తం కంటే దాదాపు రెట్టింపు కావడం విశేషం. ఈ ఏడాది పీఎస్ఎల్ విన్నర్ గా అవతరించిన లాహోర్ రూ. 3.4 కోట్ల ప్రైజ్ మనీ అందుకోగా.. రన్నరప్ ముల్తాన్ సుల్తాన్స్ సుమారు. 1.37 కోట్ల రూపాయలు గెలుచుకుంది.

Also Read : AP Skill Development Scam: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో కీలక మలుపు..

ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ ( 35), శిఖా పాండే ( 27నాటౌట్ ), రాధా యాదవ్ ( 27 నాటౌట్) మినహా ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. ముంబయి బౌలర్లలో వాంగ్, హెయిలీ మాథ్యూస్ చెరో 3 వికెట్లు తీసుకున్నారు. అమీలా కెర్ రెండు వికెట్లు తీసింది. లక్ష్య ఛేదనకు దిగిన ముంబయికి విజయం అంత ఈజీగా రాలేదు. ఓపెనర్ యాస్తికా భాటియా94), హెయిలీ మాథ్యూస్(13) నిరాశపరిచారు. బ్రంట్.. హర్మన్ ప్రీత్ కౌర్ తో కలిసి ఆచితూచి ఆడారు. ఈ జోడీ మూడో వికెట్ కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. జోరందుకున్న ఈ జోడిని కాప్సీ విడగొట్టింది. 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హర్మన్ రనౌట్ గా వెనుదిరిగింది. అరంతరం క్రీజులోకి వచ్చిన అమీలా కెర్ ( 14 నాటౌట్) చక్కని సహకారం అందించడంతో.. మరో మూడు బంతులు మిగిలిండగానే ముంబయి టార్గెట్ ను ఛేదించి కప్పు అందుకుంది.