NTV Telugu Site icon

Worst Street Food: వరస్ట్ స్ట్రీట్ ఫుడ్‌లలో మన బోండా.. ఏ ప్లేస్ లో ఉందో తెలుసా?

Food

Food

Worst Street Food: ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని తెలిసినా చాలా మంది బండ్ల మీద దొరికే ఫుడ్ ను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాటిలో కల్తీ నూనెలు, పప్పులు వాడుతూ ఉంటారని చెప్పినా పేట్ల మీద పేట్లు లాగించేస్తుంటారు. గల్లీలో ఏ బండి దగ్గర ఏ సమయంలో చూసినా గుంపులు గుంపులుగా జనం కనబడుతుంటారు. ఇక ఉదయం, సాయంత్రం వేళల్లో ఇసుకేస్తే రాలనంత మంది ఉంటారు. ఆ రేంజ్ లో ఉంటుంది మన దేశంలో చిరు తిండ్లకు డిమాండ్. రకరకాల టిఫిన్లను ఎగబడి తింటూ ఉంటారు. టిఫిన్లు మాత్రమే కాకుండా ఒక్కో ప్రాంతానికి ఒక్కో వెరైటీ ఫేమస్ ఉంటుంది. వాటిని స్ట్రీట్ ఫుడ్ లో ఉంచితే ఆ ప్రాంతం వారు ఎగబడి తింటూ ఉంటారు. ఉదాహరణకు రాయలసీమ ఉగ్గానికి, నెల్లూరు కారం దోశ, కోల్ కతా పానీపూరి, వడపావ్, ఇక చైనీస్ ఫుడ్స్ మంచురియా, న్యూడిల్స్, పాస్తా, మోమోస్, బ్రెడ్ ఆమ్లెట్, శాండ్ విచ్ లు స్ట్రీట్ ఫుడ్ లో చాలా ఫేమస్.

Also Read: Tips To Escape From drowning Car: మీరు ఉన్న కారు మునిగిపోయిందా? ఇలా తప్పించుకోండి

అయితే వంటకాలలో ఉప్మా ఎక్కువ మందికి నచ్చనట్లు ఈ స్ట్రీట్ ఫుడ్ లో కూడా కొన్ని చాలా మందికి నచ్చవు. వాటికి సంబంధించే స్ట్రీట్ ఫుడ్‌లలో అత్యంత చెత్తవి ఏంటన్న దానిపై ఓ సంస్థ సర్వే నిర్వహించగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ సంస్థ అయిన టేస్ట్ అట్లాస్ అనే కంపెనీ వినియోగదారులు ఇచ్చిన రేటింగ్ ఆధారంగా ఏ స్ట్రీట్ ఫుడ్ ఎంత వరస్ట్ అన్న విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ లిస్ట్ లో మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన బోండాలు కూడా చోటు దక్కించుకున్నాయి. అయితే బోండాలు ఈ లిస్ట్ లో టాప్ 10 లో నిలిచాయి.
దీనిలో ఫస్ట్ ప్లేస్ మాత్రం హారాష్ట్రకు చెందిన ప్రసిద్ధ దహీ పూరీకి దక్కింది. ఇక మధ్యప్రదేశ్‌కు చెందిన సెవ్ పూరీ రెండవ స్థానంలో నిలిచింది. ఇక దబేలీ, బాంబే శాండ్‌విచ్, ఎగ్ భుర్జీ, దహీ వడ, సబుదానా వడ, పాప్రీ చాట్, గోబీ పరాఠా, బోండా వరుస స్థానాల్లో నిలిచాయి. మొత్తం 2,508 మంది రేటింగ్ ఇవ్వగా దహీపూరీని 1,733 మంది వరస్ట్ ఫుడ్ అని పేర్కొన్నారు.