NTV Telugu Site icon

Video Viral: చెక్క దిమ్మలతో తయారు చేసిన ఎత్తైన టవర్.. కూలిపోయిన వీడియో వైరల్

Domino

Domino

యూకేలో చెక్క దిమ్మెలతో తయారుచేసిన అత్యంత ఎత్తైన టవర్ ను కూల్చివేసిన వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. డొమినో ఎఫెక్ట్‌ ను కలిగి ఉన్న వీడియోలను చూడటానికి చాలా మంది ఇష్టపడుతారు. ఒక వస్తువును కదలించడం ద్వారా చైన్ రియాక్షన్ తో ముందు వరుసలో ఉండే వస్తువులను పడేలా చేస్తుంది. ఇలాంటి వీడియోలు ప్రజలను చాలా ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా ఇలాంటి డొమినోలు రకరకాలుగా తయారుచేస్తుంటారు. అయితే తాజాగా.. బెంజమిన్ క్రౌజియర్ మరియు అతని బృందం ఓ డొమినోను సృష్టించారు. ఆ వీడియో ప్రపంచ రికార్డు నెలకొల్పగా.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో చెక్క దిమ్మెల బ్లాకులతో తయారు చేయబడిన ఎత్తైన టవర్ కూల్చివేతను చూడొచ్చు.

Fahadh Faasil: ఎవర్రా ఈ రత్నవేలు.. సోషల్ మీడియా అంతా ఒకటే మోత

ఒలింపియా లండన్ (UK) లో 27.46 మీటర్ల ఎత్తులో చెక్క దిమ్మెల బ్లాకులతో ఎత్తైన టవర్‌ను తయారు చేసినందుకు బెంజమిన్ క్రౌజియర్ మరియు అతని బృందానికి అభినందనలు తెలిపారు. టవర్ కూల్చివేత చాలా సంతృప్తికరంగా ఉంది, ”అని ట్విట్టర్‌లో వీడియోను పంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ రాశారు. ఆ వీడియోలో చెక్క దిమ్మెలతో నిర్మించిన ఒక ఎత్తైన నిర్మాణం కనపడుతుంది. అయితే దానిని కూల్చడానికి కౌంట్‌డౌన్ మొదలు పెట్టారు. కౌంట్‌డౌన్ ముగియగానే.. ఒక మహిళ టవర్ కింద ఒక చెక్కను కదల్చడం చూడవచ్చు. కేవలం సెకన్లలోనే టవర్ డొమినో కూలిపోతుంది.

Suprem Court: మ‌ణిపూర్‌ హింసపై సుప్రీం సీరియస్‌.. పూర్తి వివరాలతో రేపు హాజరవ్వాలని ఆదేశం

ఈ వీడియోను జూలై 27న ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. 53,100 మంది చూశారు. ఇంకా వీడియోను చూసేవారు పెరుగుతున్నారు. అంతేకాకుండా ఈ వీడియోపై చాలామంది నెటిజన్లు తమ కామెంట్స్ ను తెలుపుతున్నారు. ఒక వ్యక్తి ఏమని వ్రాశాడంటే, “అందంగా రూపొందించబడింది. నేను దానిని ప్రేమిస్తున్నాను. మరోవ్యక్తి “వస్తువులను నిర్మించడానికి చాలా రోజులు పడుతుంది, కానీ దానిని నాశనం చేయడానికి సెకన్లు పడుతుంది. అని రాసుకొచ్చాడు. “వావ్ అని మరికొందరు, బాగుంది అని మరికొందరు తెలుపుతున్నారు.