NTV Telugu Site icon

worlds most flexible girl: ఈ అమ్మాయి ఒంట్లో ఎముకలున్నాయా.. డౌటే..?

Liberty

Liberty

worlds most flexible girl: సాధారణంగా కొంతమంది శరీరాలను ఒంపులు తిప్పితేనే ఏం తిప్పుతున్నారు.. ఒంట్లో ఎముకలున్నాయా అని సందేహపడతాం.. కానీ 14ఏళ్ల అమ్మాయి తన శరీరాన్ని పూర్తి స్థాయిలో తిప్పి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. అంతే కాదు శరీర ఒంపులో గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా నెలకొల్పింది. యూకేలోని పీటర్ బరోకు చెందిన లిబర్టీ బారోస్ అనే 14ఏళ్ల బాలిక ఓ జిమ్నాస్ట్. ఆమె శరీరం ఓ ప్రత్యేకతను కలిగి ఉంది. దీంతో ఆమె కొన్నేళ్ల కిందటి నుంచి మెలిపెట్టడం మొదలుపెట్టింది. అలా మెల్లగా శరీరం మొత్తాన్ని ఎటు పడితే అటు వంచేసే సామర్థ్యం సంతరించుకుంది.

తాజాగా ‘ప్రపంచంలోనే అత్యంత ఫ్లెక్సిబుల్ గర్ల్’గా గిన్నిస్ బుక్ రికార్డు కూడా సృష్టించింది. తలను వెనక్కి తిప్పి కాళ్ల మధ్యగా తెచ్చి తన ఉదర భాగాన్ని నేలకు ఆన్చే ఫీట్ చేసింది. ఇలా కేవలం 30 సెకన్లలో పదకొండు సార్లు వంచి గిన్నిస్ బుక్ కు ఎక్కింది. సాధారణంగా మనుషులెవరూ ఇలా చేయలేరని గిన్నిస్ బుక్ ప్రతినిధులు పేర్కొనడం గమనార్హం.

Read Also: China Spy Ship : స్వదేశానికి చేరుకున్న శాటిలైట్ షిప్

శరీరాన్ని విభిన్నంగా వంచుతూ లిబర్టీ బారోస్ పలు ఫొటో షూట్లు కూడా చేసింది. తన పేరిటే ఒక ప్రత్యేకమైన వెబ్ సైట్ కూడా ఉంది. అందులో తన శరీరాన్ని స్ప్రింగుల్లా తిప్పేస్తూ చేసిన ఫీట్లకు సంబంధించిన ఫొటోలు కూడా పెట్టడం గమనార్హం. ఇప్పుడు కేవలం ప్రపంచ రికార్డును అధికారికంగా నమోదు చేసుకోవడం కోసం మాత్రమే.. గిన్నిస్ బుక్ వారి ముందు ఫీట్ చేసినట్టు లిబర్టీ తండ్రి రామ్‌ బారోస్‌ చెప్తున్నారు.

“నేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అని చెప్పుకోగలిగినందుకు చాలా గర్వంగా ఉంది. ఇది అద్భుతమైన విజయం. నా ఫ్లెక్సిబిలిటీని గ్రహించడం వల్ల నేను ఊహించిన దానికంటే మరింత ముందుకు తీసుకెళ్లాను. ఇది నా జీవితాన్ని మార్చివేసింది, ”అని ఆమె చెప్పినట్లు పీటర్‌బరో టెలిగ్రాఫ్ పేర్కొంది. 2017లో ఆమె ఫ్లెక్సిబిలిటీ గురించి తెలుసుకున్నట్లు నివేదిక పేర్కొంది.

Read Also: Womens Asia Cup 2022: గెలుపే లక్ష్యంగా.. నేడు థాయ్‌లాండ్‌తో భారత్‌ ఢీ

లిబర్టీ తన యూట్యూబ్ వీడియోలతో ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందింది. ఆమె స్పెయిన్స్ గాట్ టాలెంట్‌లో పోటీదారు కూడా. తనకు యాక్షన్ సినిమాల్లో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది. అలాగే తను సొంతంగా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు నృత్యం, శరీరాన్ని కదిలించడం ఎలాగో నేర్పించాలని అనుకుంటున్నట్లు వివరించింది.