World’s Longest Train : 100బోగీలు, నాలుగు ఇంజన్లు.. 1.9కిలోమీటర్లతో ప్రపంచంలోనే పొడవైన రైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World’s Longest Train : 100బోగీలు, నాలుగు ఇంజన్లతో ప్రపంచంలోనే పొడవైన రైలు స్విట్జర్లాండులో శనివారం పట్టాలపై పరుగులు తీసింది. ఆ దేశంలో రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చి 175సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేయిషేన్ రైల్వే కంపెనీ 1.9కిలోమీటర్లు ఉండే ప్రయాణికుల రైలును నడిపింది. ఇది 25కిలోమీట్లర్లు ప్రయాణించేందుకు గంట సమయం పట్టింది. ఈ రైలు ఆల్స్ప్ పర్వతాల గుండా సాగే మార్గంలో ప్రఖ్యాత ల్యాండ్ వాసర్ వారధి సహా 22సొరంగాలు, 48వంతెనలు, అనేక లోయలు, మలుపుల్లోని ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తూ ప్రయాణికులు మైమరచిపోయారు. ఈ మార్గాన్ని యునెస్కో 2008లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. రేయిషేన్ రైల్వే డైరెక్టర్ రెనాటో ఫాస్కియాటి మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్‌లో సాధించిన ఇంజినీరింగ్ అద్భుతాలకు గుర్తుగా, స్విస్ రైల్వే ఏర్పడి 175 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్రయాణికుల రైలును నడిపినట్లు తెలిపారు.
Read Also: vikarabad resorts : వికారాబాద్ రిసార్ట్స్ లో ప్రాణం తీసిన ట్రెజర్ హంట్ గేమ్
Also Read
- Team India: 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం.. నాడు లార్డ్స్ మైదానంలో ఓటమి.. నేడు ప్రపంచ నంబర్ 1 స్థానం..
- Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
- Amazon Offers: అమెజాన్‌లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
ఇది ఇలా ఉంటే.. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ఆస్ట్రేలియాలో ఉంది. కాకపోతే అది గూడ్స్ రైలు. ఆస్ట్రేలియాకు చెందిన బీహెచ్పీ ఐరన్ ఓర్ రైలు పొడవు 7.325 కిలో మీటర్లు. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన సరుకు రవాణా రైలుగా గుర్తించారు. ఇక భారత్ విషయానికి వస్తే మన దగ్గర కూడా పొడవైన గూడ్స్ రైలు ఉంది. దాని పేరు ‘సూపర్ వాసుకి’. దీని పొడవు 3.5 కిలో మీటర్లు. ఇది భారత్‌లోనే అత్యంత పొడవైన, బరువైన రైలు ఇది. ఈ రైలు నాగ్‌పూర్‌లోని రాజ్‌నంద్‌గావ్, ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా మధ్య 27వేల టన్నులకుపైగా బొగ్గును మోసుకెళ్తుంది. ఈ రైలుకు 295 లోడెడ్ వ్యాగన్ లతో టెస్ట్ రన్ నిర్వహించారు రైల్వే అధికారులు.
తాజావార్తలు
-
Homemade Paneer : ఇంట్లోనే సాఫ్ట్ పనీర్.. ఈ ట్రిక్ తెలిస్తే చాలు!
-
Early Pregnancy Diet: గర్భంతో ఉన్న వారు బొప్పాయి, పైనాపిల్ తినకూడదు ఎందుకు..? కారణం ఇదే..
-
Team India: 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం.. నాడు లార్డ్స్ మైదానంలో ఓటమి.. నేడు ప్రపంచ నంబర్ 1 స్థానం..
-
Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
-
Amazon Offers: అమెజాన్‌లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!