Site icon NTV Telugu

World’s Longest Train : 100బోగీలు, నాలుగు ఇంజన్లు.. 1.9కిలోమీటర్లతో ప్రపంచంలోనే పొడవైన రైలు

Longest Train In World

Longest Train In World

World’s Longest Train : 100బోగీలు, నాలుగు ఇంజన్లతో ప్రపంచంలోనే పొడవైన రైలు స్విట్జర్లాండులో శనివారం పట్టాలపై పరుగులు తీసింది. ఆ దేశంలో రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చి 175సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేయిషేన్ రైల్వే కంపెనీ 1.9కిలోమీటర్లు ఉండే ప్రయాణికుల రైలును నడిపింది. ఇది 25కిలోమీట్లర్లు ప్రయాణించేందుకు గంట సమయం పట్టింది. ఈ రైలు ఆల్స్ప్ పర్వతాల గుండా సాగే మార్గంలో ప్రఖ్యాత ల్యాండ్ వాసర్ వారధి సహా 22సొరంగాలు, 48వంతెనలు, అనేక లోయలు, మలుపుల్లోని ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తూ ప్రయాణికులు మైమరచిపోయారు. ఈ మార్గాన్ని యునెస్కో 2008లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. రేయిషేన్ రైల్వే డైరెక్టర్ రెనాటో ఫాస్కియాటి మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్‌లో సాధించిన ఇంజినీరింగ్ అద్భుతాలకు గుర్తుగా, స్విస్ రైల్వే ఏర్పడి 175 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్రయాణికుల రైలును నడిపినట్లు తెలిపారు.

Read Also: vikarabad resorts : వికారాబాద్ రిసార్ట్స్ లో ప్రాణం తీసిన ట్రెజర్ హంట్ గేమ్

ఇది ఇలా ఉంటే.. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ఆస్ట్రేలియాలో ఉంది. కాకపోతే అది గూడ్స్ రైలు. ఆస్ట్రేలియాకు చెందిన బీహెచ్‌పీ ఐరన్ ఓర్ రైలు పొడవు 7.325 కిలో మీటర్లు. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన సరుకు రవాణా రైలుగా గుర్తించారు. ఇక భారత్ విషయానికి వస్తే మన దగ్గర కూడా పొడవైన గూడ్స్ రైలు ఉంది. దాని పేరు ‘సూపర్ వాసుకి’. దీని పొడవు 3.5 కిలో మీటర్లు. ఇది భారత్లోనే అత్యంత పొడవైన, బరువైన రైలు ఇది. ఈ రైలు నాగ్‌పూర్‌లోని రాజ్‌నంద్‌గావ్, ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా మధ్య 27వేల టన్నులకుపైగా బొగ్గును మోసుకెళ్తుంది. ఈ రైలుకు 295 లోడెడ్ వ్యాగన్ లతో టెస్ట్ రన్ నిర్వహించారు రైల్వే అధికారులు.

Exit mobile version