పండ్లలో అరటిపండు రారాజు.. ఏ కార్యమైన అరటిపండు తప్పనిసరి.. ఇక అరటిపండును తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.. అయితే పండు మహా అయితే జనాడే పొడవు ఉంటుంది.. పావు కేజీ కూడా బరువు ఉండదు.. అరటిలో రకాలు ఎన్ని ఉన్నా కూడా బరువు మాత్రం ఒకేలా ఉంటుంది.. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద అరటిపండు గురించి మీకు తెలుసా.. అస్సలు అలాంటి పండు ఒకటి ఉందా అనే సందేహం వస్తుంది కదా.. ఇక ఆలస్యం ఆ పండు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఇది ఒక మనిషి చేయంతా ఉంటుంది. దీన్ని తింటే మరి భోజనం చేయాల్సిన అవసరం ఉండదు. పొట్ట నిండిపోతుంది. ఒక్కొక్క పండు మూడు కిలోల కంటే ఎక్కువ బరువు తూగుతుంది. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. అరటి పండ్లు ఇష్టపడే వారికి ఈ పెద్ద అరటి పండ్లను రుచి చూస్తే వదిలిపెట్టరు.. వీటిని జెయింట్ హైలాండ్ అరటి’ అని పిలుస్తారు. ఇవి న్యూ గినియాలోని ఉష్ణ మండల పర్వత అడవుల్లో మాత్రమే పెరుగుతాయి.. అక్కడ వాళ్లు దీన్ని ముసా ఇంజన్స్ అంటారు…
ఇవి ఎక్కువగా ఇండోనేషియాలోని పర్వతాలలో ఈ అరటి చెట్లు కనిపిస్తాయి. వీటి ఆకులు ఒక్కొక్కటి 16 అడుగుల వరకు పెరుగుతాయి. ఆ ఒక్క ఆకును పట్టుకొని మర్రిచెట్టు ఊడలను పట్టుకొని ఊగినట్టు… ఊగుతారు అక్కడ స్థానికులు. అంత దృఢంగా ఉంటాయి ఆకులు.. ఇవి చాలా పెద్దగా కూడా ఉంటాయి.. ఒక్కొక్క చెట్టు 36 పండ్లను ఉత్పత్తి చేస్తుంది. అందులో ఒక్కొక్క పండు 30 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అందుకే ఈ అరటిని అరుదైన జాతిగా గుర్తిస్తారు.. మొదటి సారి 1954లో న్యూ గినియాలో ఈ అరటి జాతిని కనిపెట్టారు. ఎలాంటి సాగు లేకుండా ఈ అరటి చెట్లు తమకు తాము గానే పెరగడం విశేషం. అక్కడున్న స్థానికులు వీటిని తినేందుకు ఇష్టపడతారు..మామూలు అరటిపండును తింటేనే కడుపు నిండుతుంది.. మరి దీన్ని తినాలంటే దమ్ము ఉండాల్సిందే..