World’s Best Cities: ప్రతి సంవత్సరం విడుదలయ్యే వరల్డ్స్ బెస్ట్ సిటీస్ నివేదిక ప్రపంచంలోని వేలాది నగరాలను పలు కోణాల్లో విశ్లేషించి ర్యాంక్ ను అందిస్తుంది. తాజాగా విడుదల చేసిన 2025 ర్యాంకింగ్స్‌లో 270 నగరాలు వివిధ 34 ఉపవర్గాల ఆధారంగా పరిశీలించబడ్డాయి. జీవన ప్రమాణాలు, ఆర్థిక శక్తి, సాంస్కృతిక ఆకర్షణ, పర్యావరణ నాణ్యత వంటి అనేక అంశాలు ర్యాంకింగ్స్‌లో ప్రధాన పాత్ర పోషించాయి. ఈ సంవత్సరం కూడా యూరప్, కొన్ని ఆసియా నగరాలు ఆధిపత్యం చెలాయించాయి. ముఖ్యంగా లండన్ వరుసగా 11వ సంవత్సరం మొదటి స్థానాన్ని దక్కించుకోవడం గ్లోబల్ నగరాల పోటీలో దాని స్థాయిని మరింత బలపరుచుకుంది.
Iphone 16 Price Drop: నెవర్ బిఫోర్ డీల్ అమ్మ.. అతి తక్కువ ధరకు ఐఫోన్ 16!
మరి ఈ లిస్టులో టాప్ 10 ఉత్తమ నగరాలలు పర్యాటకులు, వ్యాపార వేత్తలు, నివాసులందరికీ ఆకర్షణీయంగా నిలిచాయి. ప్రతి నగరం ప్రత్యేకమైన స్టైల్, సాంస్కృతిక సంపద, ఆర్థిక బలంతో గ్లోబల్ పోటీలో అగ్రస్థాని సంపాదించింది. ఇక లిస్ట్ లో లండన్ (యునైటెడ్ కింగ్‌డమ్) మొదటి స్థానం సంపాదించగా.. న్యూయార్క్ (అమెరికా) రెండో స్థానం, పారిస్ (ఫ్రాన్స్) మూడో స్థానం సంపాదించాయి. ఆపై టోక్యో (జపాన్), మాడ్రిడ్ (స్పెయిన్) లు వరుసగా 4, 5 స్థానాలను సంపాదించాయి. ఆ తర్వాత వరుసగా సింగపూర్, రోమ్ (ఇటలీ), దుబాయ్ (యుఎఈ), బెర్లిన్ (జర్మనీ), బార్సిలోనా (స్పెయిన్)లు టాప్-10 లో స్థానాలను సంపాదించాయి.
Quantum Valley: అమరావతిలో క్వాంటం వ్యాలీకి 50 ఎకరాల భూమి కేటాయింపు..
ఇక భారతీయ నగరాల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. గ్లోబల్ లెవెల్‌లో టాప్ 100 లిస్ట్ లో మూడు నగరాలకు స్థానం లభించింది. ఈ నగరాలు 2025లో ప్రత్యేకంగా నిలిచాయి. టెక్ ఇన్నోవేషన్, ఆర్థిక బలం, సాంస్కృతిక వైవిధ్యం భారత నగరాల ర్యాంకులు మెరుగవ్వడానికి కారణమయ్యాయి. ఇందులో మొదటగా కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు భారతదేశంలో టాప్ ర్యాంక్ పొందింది. గ్లోబల్ పరంగా 29వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక దీని తర్వాత దేశ ఆర్థిక రాజధాని ముంబై స్థానం సంపాదించుకుంది. ఈ నగరం 40వ స్థానాన్ని సంపాదించుకోగా.. దేశ రాజధాని ఢిల్లీ 54వ స్థానాన్ని సంపాదించుకుంది.
