టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి భారత టీ20 అధికారిక జెర్సీని బీసీసీఐ సోమవారం విడుదల చేసింది. దీనిని ప్రముఖ క్రీడా దుస్తుల బ్రాండ్, జెర్సీ స్పాన్సర్ అడిడాస్ రూపొందించింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్లలో మంగళవారం నుంచి ఈ జెర్సీలు అందుబాటులో ఉంటాయని అడిడాస్ కంపెనీ ఇటీవల ప్రకటించింది.
Also Read: Lovers In Metro: మెట్రోలో ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమికులు.. చివరకు..
ఈ జెర్సీలు రెండు వెర్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ప్లేయర్స్ ఎడిషన్ ధర రూ.5,999గా నిర్ణయించబడింది. అలాగే ఫ్యాన్ ఎడిషన్ ధర 999 రూపాయలుగా నిర్ణయించారు. అయితే, ఈ ధరలు ఇంటర్నెట్ వినియోగదారుల నుండి మిశ్రమ స్పందనలకు కారణమయ్యాయి. టీ షర్టుల కోసం ఎదురు చూస్తున్నామని కొందరు రాస్తుంటే, ధర కాస్త ఎక్కువైందని మరికొందరు అంటున్నారు. ఈ ధర కంటే విమాన టికెట్ ధర ఒకరకంగా తక్కువే అంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Also Read: Daryl Mitchell: ఏంటి బ్రో అంత పనిచేసావ్.. దెబ్బకు అభిమాని ఫోన్ దభేల్..
ఈ జెర్సీని సోమవారం ప్రత్యేకంగా ఆవిష్కరించారు. హెలికాప్టర్ సహాయంతో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ జెర్సీని ధరించిన వీడియోను అడిడాస్ విడుదల చేసింది. ఈ కొత్త జెర్సీ నీలం, కాషాయం రంగులలో డిజైన్ చేయరు. ‘వి’ షేప్ నెక్ ను ఇది కలిగి ఉంటుంది. కొంతమంది ఈ రంగు కలయికతో సంతోషంగా లేరు. టీ20 ప్రపంచకప్ టోర్నీ జూన్ 2న అమెరికా, వెస్టిండీస్ మధ్య మొదలు కానుంది. జూన్ 5న ఐర్లాండ్ తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.