NTV Telugu Site icon

World Pneumonia Day : దగ్గును దగ్గరకు రానీయకండి.. న్యుమోనియాను నిర్లక్ష్యం చేయకండి

Pneumonia

Pneumonia

World Pneumonia Day: తరచుగా జలుబు మిమ్మల్ని వదలడం లేదా.. దగ్గి దగ్గి అలసిపోతున్నారా వెంటనే వైద్యుడిని సంప్రదించండి. లేకపోతే అది ముదిరి న్యుమోనియాకు దారి తీసే అవకాశాలున్నాయి జాగ్రత్త. న్యుమోనియాను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు. దాని కారణంగా 2019లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 25లక్షల మంది చనిపోయారు. అందులో ఏకంగా 6.72 లక్షలమంది చిన్నారులు ఉన్నారు. నవంబర్‌ 12న ‘ప్రపంచ న్యుమోనియా డే’. న్యుమోనియాను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో చైల్డ్ న్యుమోనియాకు వ్యతిరేకంగా గ్లోబల్ కోయలిషన్ 2009 నవంబర్ 12 న మొదటిసారిగా ప్రపంచ న్యుమోనియా డేను నిర్వహించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ‘ప్రపంచ న్యుమోనియా డే’ జరుపుతున్నారు. న్యుమోనియా గురించి అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం.

Read Also: Huzurnagar: నకిలీ జామీన్ తయారీదారుల గుట్టురట్టు.. విచారణలో నమ్మలేని నిజాలు

న్యుమోనియా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ప్రోటోజోవాల వల్ల సోకుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శ్యాస తీసుకున్నప్పుడు అవి గాలితో శరీరంలోకి వెళ్లి తెల్లరక్తకణాలను నిర్వీర్యం చేస్తాయి. దీంతో మన శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. CDC ప్రకారం, ఒమిక్రాన్‌‌ వైరస్, SARS-CoV-2, ఇన్ఫ్లుఎంజా, RSV వైరస్ కూడా న్యుమోనియాకు కారణం కావచ్చు. పిల్లలు, వృద్ధులకు ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. అందుకే వీరు న్యుమోనియాకు త్వరగా గురవుతారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో రెస్సిరేటర్‌ సిన్సిషియల్‌ వైరస్‌(ఆర్‌ఎస్‌వీ), పెద్దవారిలో ఇన్‌ఫ్లూయోంజా వైరస్‌ వలన వచ్చే జలుబు, దగ్గు తర్వాత న్యుమోనియా తరచుగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Read Also: Bandi Sanjay Hot Comments: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. సీఎం, హోంమంత్రులను సాక్షిగా చేర్చాల్సిందే

ఆల్కహాల్‌, స్మోకింగ్‌, మంచి ఆహారం తీసుకోనివారికి, డయాబెటిస్‌, హెచ్‌ఐవీ, క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి.. ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. వీరికి న్యుమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. చలితో కూడిన జ్వరం, దగ్గు, కఫం, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. నోటి వెంట పడే కఫం రంగును బట్టీ వ్యాధి లక్షణాలు గుర్తించవచ్చు. పసి పిల్లలకు, చిన్నారులకు న్యుమోనియా లక్షణాలు ఉండకపోవచ్చని మయోక్లినిక్‌ వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో న్యుమోనియా కారణంగా వాంతులు, జ్వరం, దగ్గు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉండవచ్చు. పిల్లలకు చిన్నతనంలో ఇచ్చే బీసీజీ, పెర్టుసస్‌లతో పాటు నిమోకోకల్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడం వల్ల చిన్నారుల్లో దీన్ని నివారించవచ్చు. బిడ్డకు ఆరు నెలల వయస్సు వచ్చే వరకూ తల్లిపాలు ఇవ్వడం, చక్కని శుభ్రత పాటించడం వలన చిన్నారుల్లో న్యుమోనియా రాకుండా చాలా వరకూ నివారించవచ్చు.