World Oldest Women : ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు ఇటీవల తన 117వ పుట్టినరోజును జరుపుకుంది. ఆమె పేరు – మరియా బ్రన్యాస్ మోరీరా. స్పెయిన్‌లోని వెరోనాలో నివసిస్తున్నారు. మరియా మోరీ రెండు ప్రపంచ యుద్ధాలు, చాలా మంది నియంతలు, కరోనావైరస్ యుగాన్ని కూడా చూసింది. ఇప్పుడు ఆమెకు 11 మంది మనవళ్లు ఉన్నారు. వాస్తవానికి మానవుల సగటు వయస్సు 72.27 సంవత్సరాలు. అయితే, రోజురోజుకూ ప్రజల జీవితాలు దీర్ఘకాలం సాగుతున్నాయి. 2050 నాటికి మానవుల సగటు వయస్సు 77 ఏళ్లకు పెరగవచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
Read Also:Veligonda project: వెలిగొండ ప్రాజెక్ట్ జాతికి అంకితం.. సీఎం సంతోషం
మరియాకు కోవిడ్ -19 సోకినప్పుడు ఆమె వయస్సు 113 సంవత్సరాలు. కరోనాతో జరిగిన యుద్ధంలో మారియా గెలిచింది. ఇది ఎంతోమంది పిల్లలు, వృద్ధుల ప్రాణాలను కూడా తీసింది. మహమ్మారిని ఎదిరించి నేడు తన 117వ పుట్టినరోజును జరుపుకుంది. మరణం ఎదురుగా ఉన్నప్పుడే జీవితం ప్రాముఖ్యత మరింత అర్థమవుతుందని మరియా చెప్పింది. మరియా వృద్ధాప్య రహస్యాలను బయటపెడతామని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Read Also:Ranji Trophy 2024: మధ్యప్రదేశ్‌పై ఉత్కంఠ విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన విదర్భ!
గతేడాది ఆమె తన వృద్ధాప్యం వెనుక మంచి జీవనశైలి ప్రాముఖ్యత గురించి చెప్పింది. శాంతి, కుటుంబం, స్నేహితులతో సత్సంబంధాలు, ప్రకృతి పట్ల ప్రేమ, భావోద్వేగ స్థిరత్వం, విషపూరిత వ్యక్తులకు దూరంగా ఉండటమే ఆమె జీవిత రహస్యాలని పేర్కొంది. ఆమె కుటుంబ సభ్యులలో ఇప్పటికే చాలా మంది 90 ఏళ్లు దాటి జీవించారు. జనవరి 2023 నుండి మరియా అత్యంత వయోవృద్ధురాలిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నమోదు చేసింది. మరియా తరచుగా తన కుమార్తె సహాయంతో X (ట్విట్టర్)లో యాక్టివ్ గా ఉంటుంది.