NTV Telugu Site icon

Obesity Causes: అతిగా తినడం మాత్రమే కాదు.. ఈ తప్పులు కూడా ఊబకాయానికి కారణాలే

Obesity Causes

Obesity Causes

Obesity Causes: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఊబకాయం (Obesity) ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారింది. తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి, అనారోగ్యకరమైన అలవాట్లు ఇవన్నీ బరువు పెరగడానికి ప్రధాన కారణాలు. ఊబకాయం మన ఆరోగ్యానికి మాత్రమే కాకుండా.. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కీళ్ల సమస్యలు వంటి అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి, అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చి 4న “ప్రపంచ ఊబకాయ దినోత్సవం” (World Obesity Day)ను నిర్వహిస్తున్నారు. ఇకపోతే, బరువు పెరగడానికి కారణమయ్యే ముఖ్యమైన అలవాట్ల గురించి చూసినట్లయితే..

Read Also: Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌కు షాక్‌..! వైసీపీ ఎమ్మెల్సీపై వరుస ఫిర్యాదులు..

తగినంత నిద్ర పట్టకపోవడం:
ఆలస్యంగా మేల్కొని ఉండటం, మొబైల్, వెబ్ సిరీస్‌లకు అలవాటు పడటం వల్ల నిద్రలో లోపం ఏర్పడుతుంది. ఇది ఆకలిని పెంచే హార్మోన్ గ్రెలిన్ ను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఈ కారణం వల్ల మీరు అవసరానికి మించి తినడం జరుగుతుంది. కాబట్టి బరువు సమస్యతో ఇబ్బంది పడకూడదు అనుకుంటే ప్రతిరోజూ కనీసం 7-8 గంటల నిద్ర తీసుకోవడం మంచిది.

ఎక్కువ ఒత్తిడికి గురికావడం:
శరీరంలో కార్టిసాల్ (Cortisol) హార్మోన్ పెరగడంతో ముఖ్యంగా కడుపు, నడుము చుట్టూ కొవ్వు అధికంగా పేరుకుపోతుంది. దీన్ని తగ్గించడానికి యోగా, ధ్యానం, వ్యాయామం చేయడం మంచిది.

Read Also: UP: పెళ్లి కారు బీభత్సం.. బైక్, ఆటో ఢీ.. వీడియో వైరల్

వ్యాయామం చేయకపోవడం:
శారీరక శ్రమ లేకుండా కూర్చునే జీవనశైలి ఉన్నవారికి ఎక్కువగా బరువు పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి ప్రతి రోజు కనీసం 30 నుంచి 40 నిమిషాలు నడవడం లేదా వ్యాయామం చేయడం ఆరోగ్యకరం.

సరైన సమయంలో తినకపోవడం:
ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం తీసుకోవడం జీవక్రియను మందగింపజేస్తుంది. ప్రతిరోజూ నిర్ణీత సమయాల్లోనే ఆహారం తీసుకుంటే కొద్దిమేర ఈ సమస్య నుండి బయట పడవచ్చు.

ప్రపంచ ఊబకాయ సమాఖ్య (World Obesity Federation) 2015 లో ప్రారంభించిన “ప్రపంచ ఊబకాయ దినోత్సవం” దినోత్సవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మద్దతు ఉంది. ఈ దినోత్సవం ద్వారా ఊబకాయానికి సంబంధించిన సమస్యలపై అవగాహన పెంపొందిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. 2020 నుండి ఈ దినోత్సవాన్ని విస్తృతంగా జరుపుకుంటున్నారు. ఆరోగ్య నిపుణులు, ప్రభుత్వాలు, సంస్థలు కలసి ఊబకాయ సమస్యలకు పరిష్కార మార్గాలను చర్చిస్తున్నారు.