NTV Telugu Site icon

G20 Dinner: జీ20 ప్రత్యేక విందు కోసం భారత్ మండపంలో ప్రపంచ నాయకులు

G20 Special Dinner

G20 Special Dinner

G20 Dinner: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన జీ20 ప్రత్యేక విందు కోసం ప్రపంచ నాయకులు భారత్ మండపానికి చేరుకున్నారు. వారికి రాష్ట్రపతి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక విందులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతా మూర్తి, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, చైనా ప్రధాని లీ కియాంగ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వేదిక వద్దకు చేరుకున్నారు. ఇండోనేషియా, ఈజిప్ట్, ఆస్ట్రేలియా, ఇతర దేశాల నాయకులు కూడా ప్రత్యేక విందుకు వచ్చారు.

Also Read: G20 Summit: స్వేచ్ఛా-వాణిజ్య ఒప్పందం కోసం పని చేసేందుకు మోడీ, రిషి సునాక్ అంగీకారం!

యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్‌తో పాటు అతని భార్య అమేలీ డెర్బౌడ్రెంఘియన్ మిచెల్, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా, యూఎన్‌ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా కూడా ప్రెసిడెంట్ ముర్ము ఇచ్చిన జీ20 విందు కోసం భారత్ మండపానికి చేరుకున్నారు. అంతేకాకుండా నేతల రాకకు ముందే ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము వేదిక వద్దకు చేరుకుని వారికి అభివాదం చేశారు. దేశ రాజధానిలో అధ్యక్షుడు ద్రౌపది ముర్ము నిర్వహించిన జీ20 విందుకు ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో మొత్తం 170 మంది అతిథులు ఉన్నారు. శనివారం భారత మండపంలోని మల్టీ ఫంక్షన్ హాల్‌లో జరిగే ఈ విందుకు విదేశీ నేతలు, ప్రతినిధి బృందాల అధిపతులతోపాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేబినెట్, రాష్ట్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు, ఇతర విశిష్ట అతిథులను ఆహ్వానించారు.

Also Read: G20 Summit: ఉక్రెయిన్‌ యుద్ధంపై తీర్మానం.. జీ20 ప్రకటనపై ఉక్రెయిన్‌ ఏమందంటే?

ఈ ప్రత్యేక సందర్భం కోసం చాలా మంది అతిథులు భారతీయత ఉట్టిపడేలా వస్త్రధారణలో విందు చేయడానికి భారత మండపానికి విచ్చేశారు. శనివారం రాత్రి అధ్యక్షుడు ముర్ము ఏర్పాటు విందుకు జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా భార్య యుకో కిషిదా, ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జివా, పలువురు ప్రముఖ విదేశీ ప్రముఖులు సాంప్రదాయ భారతీయ వస్త్రాలను ధరించారు. కిషిదా భార్య యుకో కిషిదా అందమైన ఆకుపచ్చ చీర కట్టుకుంది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా భార్య త్షెపో మోట్సెపే ఇండో-వెస్ట్రన్ దుస్తులను ధరించారు. అలాగే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ముత్యాల హారంతో కూడిన చీరలో జాతి శోభను చాటారు.

నోరూరించే రుచులు
రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందులో భాగంగా అతిథులకు బంగారం, వెండి పాత్రల్లో విందు వడ్డించారు. చిరుధాన్యాలు, పనసపండుతో చేసిన గాలెట్టె( ఫ్రెంచి వంటకం) గ్లేజ్‌డ్‌ ఫారెస్ట్‌ మష్రూమ్‌, చిరుధాన్యాల వంటకాలు, కేరళ రెడ్‌రైస్‌, వివిధ రకాల బ్రెడ్‌లతోపాటు ముంబయి పావ్‌ కూడా అందించారు. డెజర్ట్‌లో యాలకులు, ఊదలతో చేసిన మధురిమ అనే పుడ్డింగ్‌, ఫిగ్‌ పీచ్‌ కంపోట్‌, ఆంబేమొహార్‌ క్రిస్పీస్‌, పాలు-గోధుమలతో చేసిన నట్స్‌ ఉంటాయి. పానీయాల్లో కశ్మీరీ ఖావా, ఫిల్టర్‌ కాఫీ, డార్జిలింగ్‌ టీ, పాన్‌ ఫ్లేవర్డ్‌ చాక్లెట్‌ ఏర్పాటు చేశారు.