Star Hospitals: వరల్డ్ కిడ్ని డేను పురస్కరించుకుని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని స్టార్ హాస్పిటల్స్‌లో ప్రపంచ కిడ్నీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం అందించే స్టార్ సెలబ్రిటీ అవార్డులను కిడ్నీ మార్పిడి చేయించుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వారికి ప్రదానం చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కవి, రచయిత, షార్ట్ ఫిల్మ్ డాక్యుమెంటరీ మేకర్ అయిన వారాల ఆనంద్‌కు ప్రముఖ మూత్రపిండ మార్పిడి నిపుణులు డాక్టర్ శ్రీధర్, డాక్టర్ జ్యోత్స్న చేతుల మీదుగా అవార్డును అందజేశారు.
Read Also: Hyderabad: నాలుగు రాళ్లు వెనకేసుకోమంటే 418 రాళ్లు వేసుకున్నాడు.. షాకైన డాక్టర్లు!
ఈ సందర్భంగా మూత్రపిండ మార్పిడి నిపుణులు డాక్టర్ శ్రీధర్, డాక్టర్ జ్యోత్స్నలు మాట్లాడుతూ.. కిడ్నీ వ్యాధి చికిత్సలో అత్యాధునిక సాంకేతిక సేవలు అందుబాటులోకి వచ్చాయని కిడ్ని వ్యాధిగ్రస్తులు బయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ వ్యాధి వల్ల సంభవించే మరణాల రేటు పెరుగుతూనే ఉందన్నారు. 2040 నాటికి కిడ్నీ వ్యాధి వల్ల సంభవించే మరణాలు పెరిగిపోతాయన్నారు. ఈ వ్యాధిని ముందుగా గుర్తించడం వల్ల మెరుగైన చికిత్స, మరణాల నివారణకు వీలు ఉన్నప్పటికీ, సాధారణంగా ఈ కిడ్నీ వ్యాధి పట్ల ప్రజలకు మెరుగైన సమాచారం అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అందుకోసమే స్టార్ హాస్పిటల్స్ వారు ప్రపంచ కిడ్నీ దినోత్సవ వేడుకల్లో పోస్ట్ ట్రాన్స్ ప్లాంట్ సర్వైవర్స్‌తో పరస్పర చర్య ద్వారా కిడ్నీ వ్యాధికి సంబంధించిన అనేక అంశాలపై అవగాహన కలిగిస్తున్నామన్నారు.
