US Iran Tensions: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మళ్లీ బంకర్లో దాక్కున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అమెరికా నుంచి హత్య బెదిరింపులు వచ్చిన తర్వాత ఖమేనీ అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. గత ఏడు నెలల్లో ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లడం ఇది రెండోసారి. గతంలో జూన్ 2025లో ఖమేనీ 21 రోజుల పాటు బంకర్లో తలదాచుకున్నాడు. ట్రంప్ భయంతోనే ఖమేనీ అండర్‌గ్రౌండ్‌కు షిఫ్ట్ అయ్యాడా, ఇరాన్లో అసలు ఏం జరుగుతుంది.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: BJP Ramchander Rao : సింగరేణిని ATMలా వాడుకుంటున్నారు
బీబీసీ పర్షియన్ కథనం ప్రకారం.. ఖాసిం సోలైమాని లేదా అబూ బకర్ అల్-బాగ్దాదీ లాగా ఖమేనీని చంపేస్తామని అమెరికా ఇటీవల బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే. ఇరాన్ దీనిని తీవ్రంగా పరిగణించి దేశ సుప్రీం నాయకుడిని బంకర్లోకి పంపింది. ఇదే టైంలో ఖమేనీపై జరిగే ఏ దాడినైనా టెహ్రాన్ యుద్ధంగా పరిగణిస్తుందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ పేర్కొన్నారు. ఇటీవల అమెరికా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను కారకాస్ నుంచి కిడ్నాప్ చేసింది. మదురో రాజధాని కారకాస్‌లోని తన నివాసంలో నిద్రిస్తున్నప్పుడు ఆయన కిడ్నాప్‌కు గురయ్యారు. ప్రస్తుతం మదురోను అమెరికా జైలులో ఉంచారు. ఆయన డ్రగ్స్ ముఠాను నడుపుతున్నందున అతన్ని కిడ్నాప్ చేశారని అమెరికా పేర్కొంది.
2025 జూన్‌లో ఇజ్రాయెల్ – అమెరికా కలిసి ఇరాన్‌పై దాడి చేసినప్పుడు ఖమేనీ టెహ్రాన్ సమీపంలోని ఒక బంకర్లో దాక్కున్నాడు. ఆయన కుటుంబం కూడా ఖమేనీతో పాటు బంకర్లోకి వెళ్ళింది. ఇరాన్ ప్రభుత్వం ఆ టైంలో అధికారికంగా బంకర్ గురించి ఎటువంటి సమాచారాన్ని విడుదల చేయలేదు. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం.. ఖమేనీ చివరిసారిగా జనవరి 17న బహిరంగంగా కనిపించారు. ఆ రోజే ఖమేనీ అమెరికా – ఇజ్రాయెల్ ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. అనంతరం నిరసనలలో గాయపడిన వ్యక్తులను కూడా ఆయన కలిశారు.
అమెరికా టార్గెట్ లీస్ట్‌లోకి ఖమేనీ..
1. ఖమేనీ ఇరాన్ అత్యున్నత నాయకుడు. ఇరాన్ ప్రభుత్వంలో సర్వాధికారులను కలిగి ఉన్నారు. దేశానికి సంబంధించిన అన్ని ప్రధాన నిర్ణయాలు ఆయన తీసుకుంటారు. కాబట్టి ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే, ఖమేనీ అంతం తప్పనిసరి అని అమెరికా నిర్ణయించింది.
2. అమెరికాకు ఖమేనీ గట్టి వ్యతిరేకిగా చెబుతుంటారు. 2016లో ఇరాన్ అమెరికాతో అణు ఒప్పందంపై సంతకం చేసినప్పుడు, ఖమేనీ దానిని బహిరంగంగా వ్యతిరేకించారు. ఆ టైంలో ఖమేనీ మాట్లాడుతూ.. అమెరికాను దెయ్యంగా అభివర్ణించారు.
2025 డిసెంబర్ చివరలో ఇరాన్లో ప్రారంభమైన నిరసనలు తాజాగా ముగిశాయి. అయినప్పటికీ ఇరాన్ అమెరికా నుంచి దాడి ముప్పును కలిగే ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి అగ్రరాజ్యం ఇరాన్‌ను నలువైపులా చుట్టుముట్టడంలో నిమగ్నమై ఉంది. ఇప్పటికే యుఎస్ఎస్ అబ్రహం లింకన్‌ను మలక్కా జలసంధిలో మోహరించారు. ఫ్లైట్ రాడార్ నివేదికల ప్రకారం.. ఇరాన్ జోర్డాన్‌లో 12 F-15 జెట్లను అమెరికా మోహరించింది. జూన్ 2025లో జోర్డాన్ సహాయంతో ఇజ్రాయెల్ ఇరాన్‌పై తన మొదటి దాడిని చేసింది. ఈ పరిణామాల మధ్య ఇరాన్ దేశ అగ్రనాయకుడిని సురక్షింతంగా రక్షించడానికి అండర్‌గ్రౌండ్‌కు తరలించినట్లు సమాచారం.
READ ALSO: Virat Kohli Mystery Drink: ఇండోర్ వన్డే మ్యాచ్.. విరాట్ కోహ్లీ తాగిన ఆ మిస్టరీ డ్రింక్ ఏంటి?