Iran Protests: ఇటీవల జరిగిన ఇరాన్ నిరసనల్లో సుమారుగా 5 వేల మంది మరణించారు. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు కనీసం 5 వేల మంది మరణించారని ప్రభుత్వం నిర్ధారించింది. వీరిలో దాదాపు 500 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని ఇరాన్ అధికారి ఆదివారం తెలిపారు. ఈ మరణాలకు ఉగ్రవాదులు, సాయుధ అల్లర్లే కారణమని, వారు చాలా మంది అమాయక ఇరాన్ పౌరులను చంపారని అధికారులు తెలిపారు.
READ ALSO: Himanta Biswa Sarma: పాకిస్తాన్ ఏజెంట్ ముందు అస్సాం తలవంచదు.. కాంగ్రెస్ నేత గురించేనా..
ఈ సందర్భంగా పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఇరాన్ అధికారి మాట్లాడుతూ.. వాయువ్య ఇరాన్‌లోని కుర్దిష్ ప్రాంతాలలో అత్యధిక హింస, మరణాలు సంభవించాయని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం కుర్దిష్ వేర్పాటువాద గ్రూపులు చురుకుగా ఉన్నాయి. నిరసనల్లో మృతి చెందిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం లేదని తెలిపారు. వీధుల్లోకి వచ్చిన వారికి ఇజ్రాయెల్, విదేశాలలోని సాయుధ గ్రూపుల నుంచి మద్దతు, ఆయుధాలు లభించాయని ఆరోపించారు. నిజానికి ఇరాన్లో అశాంతికి విదేశీ శక్తులే కారణమని ఇరాన్ ప్రభుత్వం తరచుగా చెబుతూ వస్తుంది.
ఇదే టైంలో అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ HRANA శనివారం మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఇరాన్ నిరసనల్లో సుమారుగా 3,308 మంది మరణించారని చెప్పింది. ఇంకా 4,382 కేసులు దర్యాప్తులో ఉన్నాయని తెలిపింది. నిరసనల సందర్భంగా 24 వేల మందికి పైగా అరెస్టు అయ్యారని పేర్కొంది. నార్వేకు చెందిన ఇరానియన్ కుర్దిష్ మానవ హక్కుల సంస్థ హెంగావ్ మాట్లాడుతూ.. ఇరాన్లో డిసెంబర్ చివరలో ప్రారంభమైన నిరసనల సందర్భంగా వాయువ్యంలోని కుర్దిష్ ప్రాంతాలలో అతిపెద్ద, అత్యంత హింసాత్మక ఘర్షణలు జరిగాయని వెల్లడించింది.
నిజానికి ఇరాన్లో 19 రోజుల పాటు చెలరేగిన హింసాత్మక నిరసనల వల్ల గణనీయమైన నష్టం వాటిల్లింది. 30 ప్రావిన్సులలో సుమారు 250 మసీదులు, 20 మతపరమైన కేంద్రాలు దెబ్బతిన్నాయి. 182 అంబులెన్స్‌లు, అగ్నిమాపక శాఖ పరికరాలు సహా మొత్తం $5.3 మిలియన్ల నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఈ నిరసనల కారణంగా 317 బ్యాంకు శాఖలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 4,700 బ్యాంకులు 10% నుంచి 90% వరకు దెబ్బతిన్నాయి. 1,400 ATMలు దెబ్బతినగా, 250 పూర్తిగా పనిచేయడం మానేశాయి. విద్యుత్ రంగం $6.6 మిలియన్ల నష్టాన్ని చవిచూసింది. విద్య, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 265 పాఠశాలలు, విద్యా కేంద్రాలు, మూడు ప్రధాన గ్రంథాలయాలు, ఎనిమిది సాంస్కృతిక, పర్యాటక ప్రదేశాలు, నాలుగు సినిమాహాళ్లు దెబ్బతిన్నాయి. ఇరాన్లో 19 రోజుల నిరసనల తర్వాత ఇప్పుడు పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్లు సమాచారం.
READ ALSO: Champion OTT Release Date: బాక్సాఫీస్ ‘ఛాంపియన్’ ఓటీటీ డేట్ ఫిక్స్ !