Rainbow Hospital: గుండె లోపాలను జయించిన చిన్నారులతో వరల్డ్ హార్ట్ డే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rainbow Hospital: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా పుట్టుకతో వచ్చే గుండె లోపాలను ఎదుర్కొని విజేతలుగా నిలిచిన లిటిల్ ఛాంపియన్స్‌తో కలిసి రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ వేడుకలు జరిపింది. రెయిన్‌బో హాస్పిటల్ గ్రూప్‌లో పీడియాట్రిక్ కార్డియాక్ కేర్ కోసం ప్రత్యేక కేంద్ర అయిన రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఈ 110 పడకల ఇన్‌స్టిట్యూట్ సంవత్సరానికి సుమారు 700 కార్డియాక్ ప్రొసీజర్స్, 750 కు పైగా కార్డియాక్ సర్జరీలను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా గుండె సంబంధిత సమస్యలతో పోరాడుతూ విదేశాల నుంచి వస్తోన్న వందలాది మంది పిల్లల జీవితాలను రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తోంది.
ఈ ముఖ్యమైన సందర్భాన్ని పురస్కరించుకుని, రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గర్భంలో ఉండగానే పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడి విజయవంతంగా చికిత్స పొందిన 30 మందికి పైగా చిన్నారులతో పాటుగా వారి కుటుంబ సభ్యులతో ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఆసక్తికరంగా మరో 20 మంది సర్వైవర్స్ కూడా వర్చువల్‌గా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిట్టి హృదయాలను రక్షించడంలో రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు అవసరమైన మద్దతు ఇస్తామని లారస్ ల్యాబ్స్ ప్రతిజ్ఞ చేసింది. సంవత్సరానికి 50 సర్జరీలకు తమ మద్దతును అందిస్తామని లారస్ ల్యాబ్స్ తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఎఫ్ఓ వీవీ రవికుమార్ ప్రకటించారు.
Also Read
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ఈ సందర్భంగా పీడియాట్రిక్ కార్డియాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శ్వేతా బఖ్రు మాట్లాడుతూ ” ఈ లిటిల్ ఛాంపియన్స్ తో కలిసి వేడుక జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. పుట్టుకతో వచ్చే గుండె వ్యాధులు , నిర్మాణాత్మక లోపం అని గుర్తించటం అవసరం మరియు పిండ దశలోనే ఈ సమస్యను గుర్తించడం అత్యంత కీలకం. పిండ దశలోని శిశువు ప్రాణాలను కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. పిండం దశలోనే గుర్తించబడిన కొన్ని గుండె జబ్బులకి, దీర్ఘకాలిక ఫాలో-అప్లు మినహా వైద్య లేదా శస్త్రచికిత్స జోక్యం అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో, శిశువు గర్భం లో ఉండగానే చికిత్స చేయవచ్చు. కాబట్టి, పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు కలిగి ఉన్న శిశువుల తల్లిదండ్రులు ఆశను కోల్పోవద్దని , ఈ సవాలు పై పోరాడి గెలిచి విజయవంతంగా కోలుకోవడానికి తమ బిడ్డలకి తోడ్పాతు అందించాలని నేను కోరుతున్నాను. రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ వద్ద , మేము పిల్లల జీవితాలను కాపాడేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తుంటాము. మేము ప్రతి నెలా సుమారు 200కు పైగా ఫిటెల్ ఎకో – కార్డియోగ్రఫీలు నిర్వహిస్తుంటాము. అంటే సంవత్సరానికి మొత్తం 2400 కంటే ఎక్కువ ఎకోకార్డియోగ్రామ్లు చేస్తుంటాము. వీటిలో దాదాపు 30% గుండె లోపాలను వెల్లడిస్తున్నాయి. అయితే, ఈ లోపాలలో చాలా వరకు చికిత్సతో నయం చేయవచ్చని గమనించవలసిన విషయం. ఈ పిల్లలు చక్కటి ఎదుగుదలతో మరియు మంచి ఆరోగ్యంతో వృద్ధి చెందడం చూసి మేము చాలా సంతోషిస్తున్నాము” అని అన్నారు.
రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ చిన్న స్వామి రెడ్డి మాట్లాడుతూ ” ప్రాథమిక దశలోనే గుర్తిస్తే , చాలా వరకూ పుట్టుకతో వచ్చే గుండె వైకల్యాలకు సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో శస్త్ర చికిత్సలు ప్రాణాలను కాపాడతాయి. ఈ పిల్లలకు విజయవంతంగా చికిత్స చేసి, వారిని చిరునవ్వుతో ఇంటికి పంపినప్పుడు మాకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఇక్కడ ముందస్తు జోక్యం కీలకమని అర్థం చేసుకోవడం చాలా అవసరం. శిశువు గర్బంలో ఉండగానే లోపాన్ని గుర్తించినట్లయితే, అది విజయవంతమైన చికిత్సను సులభతరం చేస్తుంది.” అని అన్నారు.
“చిట్టి హృదయాలను రక్షించడం, మరింత ముందుకు వెళ్తూ పిల్లల జీవితాలను రక్షించడంలో భాగంగా చేతులు కలపడం మాకు సంతోషంగా ఉంది. ఒక ఉదాత్తమైన లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి మాకు ఈ అవకాశాన్ని అందించినందుకు రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము” అని లారస్ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఎఫ్‌వో వీవీ రవి కుమార్ అన్నారు
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్‌లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!