NTV Telugu Site icon

World Cup 2023: వరల్డ్ కప్ సెమీస్, ఫైనల్ మ్యాచ్ టికెట్ విక్రయాలు నేడే…

Untitled 1

Untitled 1

World Cup 2023: ఇండియాలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లీగ్ దశ చివరికి చేరుకుంది. ఇప్పటికే ఒక్కో జట్టు 8 మ్యాచ్ లు చొప్పున ఆడింది. అన్ని జట్లు ఇంకో మ్యాచ్ ఆడితే లీగ్ దశ ముగియనుంది. ఇప్పటికే ఇండియా, సౌతాఫ్రికా ఇప్పటికే సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా.. ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ పై సంచలన విజయంతో సెమీస్ లోకి ప్రవేశించింది. మరోవైపు ఇంకో జట్టు సెమీస్ కు క్వాలిఫై కావల్సి ఉంది. దాని కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్ పోటీ పడుతున్నాయి.

Read Also: Bengaluru : బెంగళూరులో భారీ వర్షాలు.. కూలిపోయిన పోలీసు ఆయుధశాల..

ఇదిలా ఉంటే.. ఈ మెగా టోర్నీలో నవంబరు 15న తొలి సెమీఫైనల్, నవంబరు 16న రెండో సెమీఫైనల్ జరగనుంది. నవంబరు 19న ఫైనల్ నిర్వహించనున్నారు. ఈ మూడు నాకౌట్ మ్యాచ్ ల కోసం తుది విడత టికెట్లను ఈరోజు విక్రయించనున్నారు. రాత్రి 8 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తెలిపింది. అధికారిక వెబ్ సైట్ https://tickets.cricketworldcup.com. ద్వారా కూడా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. మరోవైపు ఈ టోర్నీని నేరుగా స్టేడియంలకు వెళ్లి చూడాలనుకునే అభిమానులకు ఇదే చివరి అవకాశమని.. ఆ తర్వాత టికెట్ల అమ్మకాలు పూర్తవుతాయని బీసీసీఐ పేర్కొంది.

Read Also: Samantha: ‘బజార్’ కోసం మళ్ళీ హద్దులు దాటేసిన సమంత

Show comments