World Cup 2025: ప్రపంచకప్ చరిత్రలోనే ఇదే మొదటిసారి.. అందరూ మహిళలే!
- సెప్టెంబర్ 30 నుంచి మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఆరంభం
- అంపైర్లు, మ్యాచ్ రిఫరీల ప్యానెల్‌ను ప్రకటించిన ఐసీసీ
- తొలిసారి పూర్తి స్థాయిలో మహిళలతో మెగా ఈవెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, శ్రీలంక ఆతిథ్యంలో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 సెప్టెంబర్ 30 నుంచి ఆరంభం కానుంది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే అన్ని టీమ్స్ తమ స్క్వాడ్‌లను ప్రకటించాయి. అంపైర్లు, మ్యాచ్ రిఫరీల ప్యానెల్‌ను తాజాగా ఐసీసీ ప్రకటించింది. ప్యానల్‌లో 14 మంది అంపైర్లు, నలుగురు మ్యాచ్ రెఫరీలు ఉన్నారు. ప్యానల్‌లో మొత్తంగా 18 మంది ఉండగా.. అందరూ మహిళలే కావడం విశేషం. తొలిసారి పూర్తి స్థాయిలో మహిళలతో మెగా ఈవెంట్‌ను నిర్వహించడం టోర్నీ చరిత్రలోనే ఇదే మొదటిసారి.
మహిళల టీ20 ప్రపంచకప్, కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళా అంపైర్లు, రిఫరీలను ఐసీసీ నియమించింది. అయితే పూర్తి స్థాయిలో మహిళలు ఉండడం ప్రపంచకప్‌లో మాత్రం ఇదే మొదటి సారి. టోర్నమెంట్‌లోని 31 మ్యాచ్‌లలో 14 మంది మహిళా అంపైర్లు, నలుగురు రిఫరీలు తమ సేవలను అందిచనున్నారు. ఇది మహిళా క్రికెట్ ప్రయాణంలో ఓ చరిత్రాత్మకమైన మార్పు అని ఐసీసీ ఛైర్మన్ జై షా అన్నారు. ఈ ముందడుగు కొత్త ఒరవడికి మార్గం సుగమం చేస్తుందని తాను ఆశిస్తున్నా అని తెలిపారు. ఇది కేవలం మైలురాయి మాత్రమే కాదని.. క్రికెట్‌లో స్త్రీ, పురుష సమానత్వాన్ని పెంపొందించడానికి ఐసీసీ చూపుతున్న నిబద్ధతకు ప్రతిబింబం అని జై షా పేర్కొన్నారు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఆస్ట్రేలియన్ క్లైర్ పోలోసాక్, జమైకన్ జాక్వెలిన్ విలియమ్స్, ఇంగ్లీష్ ఉమెన్ సూ రెడ్‌ఫెర్న్‌కు ఇది మూడవ మహిళల ప్రపంచకప్. లారెన్ అగెన్‌బాగ్, కిమ్ కాటన్‌లు రెండవ ప్రపంచకప్‌లో పాల్గొంటున్నారు. అనుభవజ్ఞులు, కొత్త వారితో ప్యానల్ సమతూకంగా ఉంది. టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. టోర్నీ మొదటి మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. టోర్నీలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి.
Also Read: Kuldeep Yadav: కష్టాన్నే నమ్ముకున్న కుల్దీప్.. ఒక్కమాట అనలేదు! చివరకు బెండు తీశాడు
ప్రపంచకప్ ప్యానెల్:
మ్యాచ్ రిఫరీలు: ట్రూడీ అండర్సన్, షాండ్రే ఫ్రిట్జ్, జీఎస్ లక్ష్మి, మిచెల్ పెరీరా.
అంపైర్లు: లారెన్ అజెన్‌బాగ్, కాండేస్ లా బోర్డే, కిమ్ కాటన్, సారా దంబనేవానా, షతీరా జాకీర్ జెస్సీ, కెర్రిన్ క్లాస్టే, జనని ఎన్, నిమాలి పెరెరా, క్లైర్ పోలోసాక్, బృందా రాఠీ, స్యూ రెడ్‌ఫెర్న్, ఎలోయిస్ షెరిడాన్, గాయత్రి వేణుగోపాలన్, జాక్వెలైన్స్.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!