Site icon NTV Telugu

World Cup 2023 : వన్డే ప్రపంచ కప్‌ 2023 షెడ్యూల్ ఫిక్స్ ..!

World Cup

World Cup

ఐపీఎల్ తర్వాత క్రికెట్ అభిమానుల ఎంతగానో ఎదురుచూసే టోర్నీ వన్డే ప్రపంచకప్ గురించే చెబుతున్నాం.. పైగా ఈ సారి వన్డే ప్రపంచకప్ 2023 మన భారత్ దేశంలోనే జరగనుంది. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. భారత్ వేదికగా జరగనున్న ఈ టోర్నీ అక్డోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19 వరకు జరిగే అవకాశం ఉంది. ఈ మెగా ఈవెంట్ కు హోస్ట్ అయిన బీసీసీఐ కనీసం డజను వేదికలను షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

Also Read : TSPSC: ఇచ్చట అన్ని రకాల ఎగ్జామ్ పేపర్లు లభించును

అహ్మదాబాద్ లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఈ టోర్నీ ప్రాంభ వేదిక కానున్నది. అహ్మదాబాద్ స్టేడియంతో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గౌహతి, హైదరాబాద్, కోల్ కతా, లక్నో, ఇండోర్, రాజ్ కోట్, ముంబై 12 వేదికలను బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసినట్లుగా సమాచారం. మొత్తం ఈ టోర్నమెంట్ లో 46 రోజుల వ్యవధిలో మూడు నాకౌట్ లతో సహా 48 మ్యాచ్ లు జరగనున్నాయి. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో రుతుపవనాలు వల్ల ఎదురయ్యే సమస్యల కారణంగా వేదికలను ఖరారు చేయడంతో జాప్యం జరుగుతుంది.

Also Read : Ugadi Wishes: శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

సాధారణంగా ఐసీసీ కనీసం ఒక సంవత్సరం ముందుగానే ప్రపంచ కప్ షెడ్యూల్ ను రిలీజ్ చేస్తుంది. అయితే భారత ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతుల కోసం బీసీసీఐ వేచి చూస్తున్నట్లు సమాచారం. ఈ టోర్నీకి పన్ను మినహాయింపు, పాకిస్తాన్ జట్టుకు వీసా క్లియరెన్స్ వంటి రెండు అంశాలు బీసీసీఐ ముందున్నాయి. గత వారాంతంలో దుబాయ్ లో జరిగిన ఐసీసీ త్రైమాసిక సమావేశాల సందర్భంగా పాకిస్తాన్ బృందానికి వీసాలను భారత ప్రభుత్వం క్లియర్ చేస్తుందని బీసీసీఐ.. ఐసీసీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read : NIKHAT ZAREEN : ప్రపంచబాక్సింగ్ క్వార్టర్స్ లోకి తెలంగాణ అమ్మాయి..

ఇక, ఈ మెగా ఈవెంట్ కు ఇప్పటికే ఏడు జట్లు అర్హత సాధించగా, చివరి మూడు స్థానాల కోసం తీవ్ర పోరు సాగుతుంది. దక్షిణాఫ్రికా, వెస్టిండిస్, శ్రీలంక కూడా ఇంకా తమ స్థానాలను బుక్ చేసుకోలేదు. ఐసీసీ పురుషుల ప్రపంచకప్ సూపర్ లీగ్ స్టాండింగ్స్ లో మొదటి ఎనిమిది జట్లు నేరుగా ఫైనల్ కి అర్హత సాధిస్తాయి. వన్డే ప్రపంచకప్ కు అర్హత సాధించిన జట్లు.. ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్తాన్.. ఉండగా వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు ప్రధాన ఈవెంట్ బెర్త్ కు పోటీ పడుతున్నాయి.

Exit mobile version