NTV Telugu Site icon

World Cup 2023: ప్రపంచకప్‌ 2023కి భారత్ జట్టు ఇదే.. రాహుల్, అయ్యర్ ఎంట్రీ! మరో అనూహ్య ఎంపిక

India Preliminary Squad

India Preliminary Squad

Team India Likely Preliminary Squad for ICC ODI World Cup 2023: భారత్‌ వేదికగా అక్టోబర్‌లో ప్రపంచకప్‌ 2023 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. మెగా టోర్నీ కోసం ఇప్పటి నుంచే అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా 18 మందితో కూడిన ప్రాథమిక జట్టును ప్రకటించింది. దాంతో భారత ప్రాథమిక జట్టు ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రిలిమినరీ స్క్వాడ్ ఇదే అంటూ సోషల్‌ మీడియాలో 19 మంది పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో గాయపడిన సీనియర్లు ఎంట్రీ ఇవ్వగా.. ఇద్దరు అనూహ్యంగా జట్టులోకి వచ్చారు.

నెట్టింట వైరల్ అవుతున్న ప్రపంచకప్‌ 2023 జట్టులో గాయాల కారణంగా చాలా కాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్న సీనియర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రాలు రీఎంట్రీ ఇచ్చారు. బ్యాటర్ సంజూ శాంసన్‌.. పేసర్లు ముకేశ్‌ కుమార్‌, జయదేవ్‌ ఉనద్కత్‌లకు అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్నారు. కుల్దీప్ యాదవ్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చహల్ జట్టులో ఉన్నారు. కారు ప్రమాదం నుంచి కోలుకుంటున్న రిషబ్ పంత్ మాత్రం ప్రపంచకప్‌ 2023కి ఎంపికవ్వలేదు.

ప్రపంచకప్‌ 2023 జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్.. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్.. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా.. పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఎలాగూ ఉంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ జట్టులో బీసీసీఐ 2-3 మార్పులు మాత్రమే చేసే అవకాశం ఉంది. ఆసియా కప్‌ 2023లో కూడా ఇదే జట్టు బరిలోకి దిగనుందని తెలుస్తుంది. ఇక ప్రపంచకప్‌ 2023 పాల్గొనే అన్ని టీమ్స్ సెప్టెంబర్‌ 28లోగా తమ జట్లను ప్రకటించాల్సి ఉంది.

Also Read: Gold Today Price: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు! నేటి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

ప్రపంచకప్‌ 2023 భారత ప్రాథమిక జట్టు ఇదే:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, జైదేవ్ ఉనద్కత్‌, ముకేశ్ కుమార్, యుజ్వే​ద్ర చహల్.