NTV Telugu Site icon

World Cup 2023 Awards: ప్రపంచకప్‌ 2023లో అవార్డులు అందుకున్న ప్లేయర్స్ వీరే.. టీమిండియాకు ఆరు!

Virat Kohli Player Of The Series

Virat Kohli Player Of The Series

ICC ODI World Cup 2023 Awards: ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియా.. విశ్వవిజేతగా ఆవిర్భవించింది. రికార్డు స్థాయిలో 6వ సారి వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ఆసీస్ గెలుచుకుంది. విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన ట్రావిస్ హెడ్ (137; 120 బంతుల్లో 15×4, 4×6).. కోట్లాది మంది భారత అభిమానుల హృదయాలను ముక్కలు చేశాడు. సూపర్ సెంచరీ చేసిన హెడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇక టోర్నీ ఆరంభంలో పరాజయాలను ఎదుర్కొన్న ఆసీస్.. అనూహ్య విజయాలతో తుది పోరుకు అర్హత సాధించి ఏకంగా ట్రోఫీనే ఎగరేసుకుపోయింది.

10 వరుస విజయాలు సాధించిన భారత్.. తుది మెట్టుపై బోర్లా పడింది. వన్డే ప్రపంచకప్ 2023 ట్రోఫీ దక్కకున్నా.. అత్యధిక పరుగుల వీరుడు, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ వంటి అవార్డులు భారత్ గెలుచుకుంది. మొత్తంగా టీమిండియాకు ఆరు అవార్డులు వచ్చాయి. విరాట్ కోహ్లీ, మహ్మద్‌ షమీ, రోహిత్‌ శర్మలను ఆరు అవార్డులు వరించాయి. కోహ్లీకి మూడు అవార్డులు దక్కగా.. షమీకి రెండు, రోహిత్‌కు ఓ అవార్డు దక్కింది.

Also Read: World Cup 2023 Prize Money: ఆస్ట్రేలియాకు 33 కోట్లు.. వన్డే వరల్డ్‌కప్‌ ప్రైజ్ మనీ వివరాలు ఇవే!

అవార్డులు అందుకున్న ప్లేయర్ల లిస్టు ఇదే:
# ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ – విరాట్ కోహ్లీ (765 పరుగులు, 1 వికెట్, 5 క్యాచ్‌లు)
# అత్యధిక అర్ధ శతకాలు – విరాట్‌ కోహ్లీ (6 హాఫ్ సెంచరీలు)
# అత్యధిక పరుగులు – విరాట్‌ కోహ్లీ (11 ఇన్నింగ్స్‌లో 765 పరుగులు)
# అత్యధిక వికెట్లు – మహ్మద్‌ షమీ (7 ఇన్నింగ్స్‌లో 24 వికెట్లు)
# అత్యుత్తమ గణాంకాలు – మహ్మద్‌ షమీ (7/57)
# అత్యధిక సిక్సర్లు – రోహిత్‌ శర్మ (31 సిక్స్‌లు)
# ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఫైనల్‌ – ట్రవిస్‌ హెడ్‌ (137 పరుగులు, 1 క్యాచ్‌)
# అత్యధిక వ్యక్తిగత స్కోర్ – గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (201 పరుగులు- నాటౌట్‌)
# అత్యధిక స్ట్రైక్‌రేట్ – గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (150.37)
# అత్యధిక సెంచరీలు – క్వింటన్‌ డికాక్‌ (4 శతకాలు)
# అత్యధిక క్యాచ్‌లు – డారిల్‌ మిచెల్‌ (11 క్యాచ్‌లు)
# అత్యధిక అవుట్లు చేసిన వికెట్‌ కీపర్‌ – క్వింటన్‌ డికాక్‌ (20)