NTV Telugu Site icon

World Breastfeeding Week: ఆగస్టు 1 నుంచి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

World Breast Feeding Week

World Breast Feeding Week

World Breastfeeding Week: “తల్లి పాలివ్వడాన్ని మెరుగుపరిచే ప్రయత్నాలను బలోపేతం చేయడానికి, ప్రతి ఏడాది ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా “అంతరాలు లేకుండా అందరికీ తల్లిపాల మద్దతు” అనే థీమ్‌తో నిర్వహిస్తున్నామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. ఇవాళ(జులై 31న) వెలగపూడిలోని ఏపీ సెక్రటేరియట్‌లోని 5వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్‌లో వైద్యఆరోగ్య శాఖ రూపొందించిన ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ (ఐఇసి) మెటీరియల్‌ను ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి. హరికిరణ్‌తో కలిసి కృష్ణబాబు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ (చైల్డ్ హెల్త్ & ఇమ్యునైజేషన్) డాక్టర్ అర్జునరావు, రాష్ట్ర సలహాదారులు పాల్గొన్నారు.

Read Also: Pinnelli Ramakrishnareddy: పిన్నెల్లికి మరోసారి చుక్కెదురు.. బెయిల్ నిరాకరణ

తల్లులు, కుటుంబ సభ్యులతో కూడిన ప్రాంతాలు, కమ్యూనిటీ స్థాయిలో రాష్ట్రంలో తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటామని ఈ సందర్భంగా కృష్ణబాబు తెలిపారు. పుట్టిన ఒక గంటలోపు తల్లిపాలను అందించడం, మొదటి ఆరు నెలలు ప్రత్యేకంగా తల్లిపాలు ఇవ్వడం, రెండేళ్ల వరకు తల్లిపాలను కొనసాగించడంతో పాటు సురక్షితమైన పోషకాహారాన్ని పరిచయం చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇన్‌ఫెక్షన్లు, పోషకాహార లోపానికి వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన రక్షణ కవచాన్ని అందించడానికి, పిల్లలలో మెదడు అభివృద్ధిని పెంచడానికి ఏడాది వయస్సు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు తల్లిపాల పోషణ అవసరమని ఆయన అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని సాయి నగర్‌ యూపిహెచ్‌సీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగస్టు 1న ప్రారంభిస్తారన్నారు. దీనితో పాటే జిల్లా కలెక్టర్ల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో ఏకకాలంలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

Read Also: AP CM Chandrababu: మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఇసుక లభ్యత, ధరలపై కీలక చర్చ

అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు వారం రోజుల పాటు తల్లిదండ్రులు , కుటుంబ సభ్యులకు అవగాహన పెంపొందించటం, వారితో సమావేశాన్ని నిర్వహించడం, తల్లి పాలివ్వడాన్ని ముందుగానే ప్రారంభించడం ప్రాముఖ్యతపై వైద్య సిబ్బందికి అవగాహన కల్పిడం వంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తారన్నారు. ఏఎన్సీ క్లినిక్‌లలో కాబోయే తల్లులకు ముందుగా తల్లిపాలు పట్టడం గురించి అవగాహన కల్పించడం ఆయా కేంద్రాల స్థాయిలో కౌన్సెలింగ్ సెషన్‌లు నిర్వహిస్తారన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ, ఐసీడీఎస్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, తదితర శాఖలు, యూనిసెఫ్, నూరాహెల్త్ ఆర్గనైజేషన్ వంటి భాగస్వాములతో కూడిన బృందాలు తల్లి పాలివ్వడాన్ని ప్రోత్సహించడానికి కన్వర్జెన్స్ కార్యకలాపాలపై దృష్టి సారిస్తాయన్నారు. తల్లిపాల ప్రాముఖ్యత యొక్క సందేశం అన్ని స్థాయిలకూ చేరేలా ఈ ఐఇసీ మెటీరియల్‌ని అందిస్తున్నామని, ఇది అన్ని ప్రజారోగ్య కేంద్రాలలోని ప్రముఖ ప్రదేశాలలో ప్రదర్శిస్తారని కృష్ణబాబు వివరించారు