Bank Working Hours: బ్యాంకు వినియోగదారులకు శుభవార్త. బ్యాంకింగ్ పని గంటలు పెరగబోతున్నాయి. 5 రోజుల పని విధానం కోసం బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు పని గంటలు పెంచాలని ప్రతిపాదించాయి. ఇండియన్ బ్యాంకు అసోసియేషన్‌కు రాసిన లేఖలో.. ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ పలు ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం ప్రారంభమవుతున్న బ్యాంకింగ్ సమయాలను 30 నిమిషాలు ముందుకు జరపాలని పేర్కొంది. అలాగే కస్టమర్ సర్వీసు అవర్స్‌ను కూడా 30 నిమిషాల పాటు పెంచాలని ప్రతిపాదించింది. ఈ బ్యాంకు ఎంప్లాయీస్ బాడీ పంపిన లేఖలో.. బ్యాంకు పని వేళలను ఉదయం 9.15 నుంచి సాయంత్రం 4.45కి మార్చాలని పేర్కొంది. అలాగే నగదు లావాదేవీల అవర్స్‌ను కూడా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30కి, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటల మధ్యలోకి మార్చాలని పేర్కొన్నాయి.
Read Also: E-Waste: ఒక్క ఏడాదిలోనే చెత్తకుప్పలోకి 530 కోట్ల మొబైల్ ఫోన్స్
బ్యాంకులలో ఐదు రోజుల పని వారాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ.. తాము ఈ ప్రతిపాదలను పంపినట్టు ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటచాలం చెప్పారు. తాము 30 నిమిషాల పాటు వర్కింగ్ అవర్స్‌ను పెంచుతూ 5 రోజుల పని విధానాన్ని కోరడంపై ఐబీఏ, కేంద్రం, ఆర్‌బీఐ ఒప్పుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిద్ సమయం నుంచే బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఈ ఐదు రోజుల పని విధానాన్ని డిమాండ్ చేయడం ప్రారంభించాయి. ఆ సమయంలో ఐబీఏ ఆ ప్రతిపాదనను కొట్టివేసింది. కానీ బ్యాంకు ఉద్యోగులకు 19 శాతం వేతన పెంపును చేపట్టింది. ప్రస్తుతం బ్యాంకులు ఆదివారాలతో పాటు రెండో, నాలుగో శనివారాలు సెలవును పాటిస్తున్నాయి. ప్రస్తుతం బ్యాంకు సంఘాలు చేసిన ఈ ప్రతిపాదనలకు కేంద్రం, ఆర్‌బీఐ, ఐబీఏ ఓకే చెబితే.. ఇక నుంచి అన్ని ఆదివారాలు, శనివారాలు బ్యాంకులు మూతపడతాయి. కానీ పని వేళలు పెరుగుతాయి. ప్రతి రోజూ ఉదయం 9.15కే బ్యాంకులు తెరుచుకుంటాయి.